Page Loader
Air Pollution : దిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. ఏక్యూఐ 300కి చేరిన గాలి నాణ్యత!
దిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. ఏక్యూఐ 300కి చేరిన గాలి నాణ్యత!

Air Pollution : దిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. ఏక్యూఐ 300కి చేరిన గాలి నాణ్యత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2024
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో గాలి నాణ్యత బుధవారం ఉదయం 7 గంటల సమయానికి అధ్వాన స్థితికి చేరుకుంది. ఏక్యూఐ (AQI) 300కి పడిపోయింది. కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం, అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ 300కి పైనే నమోదైంది. ఏక్యూఐ వివరాలు: ఆనంద్ విహార్: 351 బవానా: 319 అశోక్ విహార్: 351 వాజీపూర్: 327 అయా నగర్: 290 ఐటీవో వద్ద: 284 గాలి నాణ్యత దిగజారడంతో దిల్లీ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరిగి, ప్రజలు ఆరోగ్య పరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు.

Details

యమునా నదిలో కాలుష్యం

అయితే, కాళింది కుంజ్ ప్రాంతంలో యమునా నది విషపూరిత నురగతో నిండిపోయి తీవ్రంగా కాలుష్యానికి గురైంది. ఈ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో, గత కొన్ని రోజులు నుండి ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెడుతున్న కారణంగా, దిల్లీలో కాలుష్యం మరింత ఎక్కువైంది. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రోజురోజుకూ అధ్వాన స్థితికి చేరుకుంటోంది. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం, గాలి నాణ్యత 447కి పడిపోతే, అది తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) స్థాయిలను ఇలా అర్థం చేసుకోవచ్చు:

Details

ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం

0-100: బాగా ఉండి, కాలుష్యం లేదు. 100-200: మధ్యస్థమైన గాలి నాణ్యత 200-300: అధ్వాన స్థితి 300-400: మరింత అధ్వాన స్థితి 400-500: తీవ్ర కాలుష్యం ఈ పరిస్థితుల వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.