Loading...
Cyclone Akvan: తీరం దాటిన 'అక్వాన్‌' తీవ్ర తుపాను.. ఉత్తరాంధ్రలో వర్షాలు
తీరం దాటిన 'అక్వాన్‌' తీవ్ర తుపాను.. ఉత్తరాంధ్రలో వర్షాలు

Cyclone Akvan: తీరం దాటిన 'అక్వాన్‌' తీవ్ర తుపాను.. ఉత్తరాంధ్రలో వర్షాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్‌' తీవ్ర తుపాను తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌ సమీపంలో తీరాన్ని తాకినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని తెలిపారు. అప్పుడప్పుడు గాలి వేగం గంటకు 90 కిలోమీటర్ల వరకు నమోదైనట్లు పేర్కొన్నారు.

వివరాలు 

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు

అక్వాన్‌ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.

ఉత్తరాంధ్రలోని మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

తుపాను ప్రభావంతో గురువారం శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

ఇచ్ఛాపురంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కంచిలి, కవిటి ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

సోంపేటలో 9.2 సెంటీమీటర్లు, పలాసలో 9.9 సెంటీమీటర్లు, వజ్రపుకొత్తూరులో 4.9 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT