Sexual assault allegations: ప్రజ్వల్ పోలీసు కస్టడీ జూన్ 10 వరకు పొడిగింపు
ఈ వార్తాకథనం ఏంటి
లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు బెయిల్ నిరాకరించింది. ప్రజ్వల్‌కు మరో నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించారు.
కస్టడీ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారు. 34 రోజులపాటు పరారీలో ఉన్న ప్రజ్వల్‌ను గత నెల 31న బెంగళూరులో అరెస్టు చేశారు.
కర్ణాటకలోని హాసన్‌లో ఎన్డీయే అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి పాలయ్యారు. దేవెగౌడ కుటుంబానికి సిట్టింగ్ సీటుగా ఉన్న హాసన్‌లో 25 ఏళ్ల తర్వాత జేడీఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
సొంత నియోజకవర్గమైన హసన్‌ను దేవెగౌడ మనవడికి అప్పగించారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ పటేల్ గౌడ 45 వేల మెజార్టీతో గెలుపొందారు.
Details
అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీ ప్రజ్వల్
హాసన్ నుండి సిట్టింగ్ ఎంపీ అయిన ప్రజ్వల్, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, హోలెనరసిపూర్ ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ పెద్ద కుమారుడు.
33 ఏళ్ల ప్రజ్వల్ కర్ణాటకలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీ. ఎన్నికల సమయంలో ప్రజ్వల్‌పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశమయ్యాయి.
ప్రజ్వల్‌పై వచ్చిన వేధింపుల ఫిర్యాదుల గురించి బీజేపీ నాయకత్వానికి ముందే తెలుసనీ కాంగ్రెస్ ఆరోపించింది.
సమాచారం బయటకు వచ్చిన తర్వాత కూడా బీజేపీ కాపాడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.