Page Loader
Shabbir Ali-Phone tapping: మా ప్రైవేట్ సంభాషణలు కూడా విన్నారు: షబ్బీర్ అలీ

Shabbir Ali-Phone tapping: మా ప్రైవేట్ సంభాషణలు కూడా విన్నారు: షబ్బీర్ అలీ

వ్రాసిన వారు Stalin
Apr 15, 2024
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంపై కాంగ్రెస్ (Congress) నేత షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు చేశారు. తాను, తన భార్య ఫోన్ లో మాట్లాడుకున్న ప్రైవేట్ సంభాషణలను కూడా విన్నారని ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందని నాడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఏడాదిముందే హెచ్చరించారని షబ్బీర్ అలీ (Shabbir Ali) చెప్పారు. కామారెడ్డి లో షబ్బీర్ అలీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ....ఫోన్ ట్యాపింగ్ చట్ట ప్రకారం పెద్ద నేరమని తెలిపారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం జైలుకు కూడా వెళ్తుందని చెప్పారు. పదేళ్లు ఎంపీగా పనిచేసిన బీబీపాటిల్ తెలంగాణకు చేసింది శూన్యమన్నారు. ఆయనకు నియోజక వర్గ పరిధిలోని మండలాల పేర్లు కూడా తెలియదని ఎద్దేవా చేశారు.

Shabbir Ali comments

నాలుగు నెలల్లోనే అమలు చేశాం: షబ్బీర్​ అలీ

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఒక్కో హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. ఏడాది లోపు తమ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.