
Amitshah: ఎన్నికల తర్వాత యూసీసీ, ఒకే దేశం ఒకే ఎన్నికలు: అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
ఉమ్మడి పౌర సృతిపై (UCC) హోంమంత్రి అమిత్ షా మరో మారు కుండబద్ధలు కొట్టారు.
పిటిఐ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్యూలో బీజేపీ అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
ఒక దేశం ,ఒకజాతి, ఒకే ఎన్నిక నినాదం వల్ల ప్రజా ధనం వృధా కాదని అభిప్రాయ పడ్డారు.
UCCని పార్ల మెంట్ , అన్ని రాష్ట్రాల ఆమోద ముద్రతో అమలు చేస్తామన్నారు.
రాజ్యాంగాన్ని రచించిన బాబూ రాజేంద్ర ప్రసాద్ , బాబా సాహెబ్ అంబేద్కర్ లు కూడా UCCకి మొగ్గు చూపారని గుర్తు చేశారు.
అందుకే ఇప్పటికే ఉత్తరాఖండ్ లో అమలు చేస్తున్నామని తెలిపారు.
Details
వరుస ఎన్నికలపై విధానం మారాలి
ఒక దేశం , ఒకే ఎన్నిక నినాదంపై అమిత్ షా స్పందించారు.దీని వల్ల ప్రజా ధనం వృధా కాదని అమిత్ షా తలిపారు.
అందుకే ప్రధాని మోదీ .. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నాయకత్వంలో కమిటీని వేశారన్నారు. ఈ కమిటీలో తాను సభ్యుడునని గుర్తు చేశారు.
వరుస ఎన్నికల వల్ల సమయం, డబ్బు వృధా తప్ప వేరే ప్రయోజనం వుండదన్నారు.
మండే ఎండల్లో పోలింగ్ కు రావాల్సిన బాధ్యత ప్రజలకు తగ్గుతుందని వివరించారు. దీనిపై సమగ్ర చర్చ జరగాలని సూచించారు.
లోక్ సభ ఎన్నికలకు బిజెపి ప్రణాళికపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 విధాన నిర్దేశక సూత్రాలలో UCCని ఒకటిగా బిజెపి భావిస్తుందన్నారు.
Details
యూనిఫాం సివిల్ కోడ్‌ను రూపొందించాలి
ఇది కేంద్ర,రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉందన్నారు.మహిళలందరి హక్కులను పరిరక్షించే UCCని ఆమోదించేంత వరకు లింగ సమానత్వం ఉండదని బిజెపి విశ్వసిస్తోందని తెలిపారు .
యూనిఫాం సివిల్ కోడ్‌ను రూపొందించాలనే తన వైఖరిని తమ పార్టీ పేర్కొన్న సంగతిని హోం మంత్రి గుర్తు చేశారు.