Sakthi app: నెట్వర్క్ లేని రిమోట్ ప్రదేశాల్లో కూడా పనిచేసే శక్తి యాప్.. దీని స్పెషాలిటీ ఏంటంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ ప్రభుత్వంలో పస లేని చట్టాన్ని పక్కన పెట్టి, కొత్తగా'శక్తి యాప్'(Sakthi App)ని తీసుకువస్తున్నట్టు హోం మంత్రి వంగలపూడి అనిత మండలిలో ప్రకటించారు.
నెట్‌వర్క్ లేని మారుమూల ప్రాంతాల్లో కూడా పని చేసేలా ప్రత్యేకంగా ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్టు వివరించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వతేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా'శక్తి యాప్'ను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
మహిళలు,చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
'ఈగల్' (Eagle) మాదిరి ఒక ప్రత్యేక విభాగం ఉంటుందని,దీనికి ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారి నేతృత్వం వహిస్తారని తెలిపారు.
మహిళలకు రాజకీయాలకు అతీతంగా రక్షణ కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మహిళల భద్రత విషయంలో ఎటువంటి రాజీపడబోమని స్పష్టంగా పేర్కొన్నారు.
వివరాలు
మహిళా భద్రత కోసం చేపట్టిన చర్యలు
దిశ యాప్ (Disha App) వల్ల గత ప్రభుత్వ హయాంలో రక్షణ లభించిందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత తీవ్రంగా స్పందించారు.
దిశ చట్టం కింద ఇప్పటివరకు ఒక్క కేసు అయినా ఫిర్యాదు చేసిందా? దిశ యాప్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైందని విమర్శించారు.
గత ఐదేళ్లలో దిశ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదు? దిశ యాప్ ద్వారా ఎంతమందిని రక్షించారు? వంటి కీలక ప్రశ్నలు విసిరారు.
హోం మంత్రి అనిత ప్రకారం,పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం 2013 పీఓఎస్‌హెచ్ (POSH) చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు.
వివరాలు
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత 2024లో మొత్తం 30 కేసులు
2019 నుంచి 2024 వరకు ఈ చట్టం కింద 85 కేసులు నమోదయ్యాయి.
41ఎ సీఆర్ పీసీ/35(3) కింద 72 మందికి బీన్ఎస్ఎస్ (BNS) నోటీసులు జారీ చేశారు.
మొత్తం ఫిర్యాదులపై దర్యాప్తు చేసి, 24 మందిని అరెస్టు చేశామని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
2024 సెప్టెంబరు నుంచి 2025 జనవరికి మధ్యలో కమిటీలకు వచ్చిన మొత్తం ఫిర్యాదులు 50 అని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత 2024లో మొత్తం 30 కేసులు నమోదయ్యాయి. 23 మందికి నోటీసులు ఇచ్చి, ఇప్పటివరకు 5 మందిని అరెస్టు చేశామని వివరించారు.
వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా కమిటీల ఏర్పాటు
వేధింపులు, దాడులు ఎదురైన మహిళలు ఫిర్యాదు చేయేందుకు జిల్లా స్థాయిలో స్థానిక ఫిర్యాదు కమిటీలు, అంతర్గత ఫిర్యాదు కమిటీలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
ప్రతి పదిమంది మహిళలతో ఏర్పాటైన కమిటీలలో 50% ప్రాతినిధ్యం మహిళలకు ఉంటుందని పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలో మొత్తం 6,681 అంతర్గత కమిటీలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏపీ వ్యాప్తంగా 26 ఎల్సీ (LC), ఐసీ (IC) కమిటీలు ఏర్పాటయ్యాయి.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో మహిళా భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం అని హోం మంత్రి పేర్కొన్నారు.
వివరాలు
వరుదు కళ్యాణి, ఏసు రత్నం ప్రశ్నలకు అనిత సమాధానం
ఏదైనా వేధింపులు ఎదురైతే భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, బాధితులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన ప్రశ్నలను వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, హోం మంత్రిని అడగడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఏ ప్రశ్న ఎవరిని అడగాలో స్పష్టమైన అవగాహన అవసరమని సూచించారు.
శాసన మండలిలో మంగళవారం వైసీపీ ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, ఏసు రత్నం అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి అనిత తగిన విధంగా సమాధానం ఇచ్చారు.