Page Loader
Sharad Pawar: 'ఐయామ్ ఫైర్, నాట్ రిటైర్', అజిత్‌కు శరద్ పవార్ అదిరిపోయే కౌంటర్ 
'ఐయామ్ ఫైర్, నాట్ రిటైర్', అజిత్‌కు శరద్ పవార్ అదిరిపోయే కౌంటర్

Sharad Pawar: 'ఐయామ్ ఫైర్, నాట్ రిటైర్', అజిత్‌కు శరద్ పవార్ అదిరిపోయే కౌంటర్ 

వ్రాసిన వారు Stalin
Jul 08, 2023
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

తనపై అజిత్ పవార్ చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీసీ) చీఫ్ శరద్ పవార్ శనివారం స్పందించారు. 'నేను అలిసిపోలేదని, రిటైర్‌మెంట్ కాలేదని, నాలో ఇంకా ఫైర్ ఉంది' అని శరద్ పవార్ అన్నారు. తన జీవితం ఎన్‌సీసీకి అంకితం అని వ్యాఖ్యానించారు. తనకు ఇంకా వయస్సు రాలేదు శరద్ పవార్ నొక్కి చెప్పారు. 'నేను అలసిపోను, పదవీ విరమణ పొందను' అన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మాటలను ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. తనను పదవీ విరమణ చేయమని చెప్పడానికి వారు ఎవరని ప్రశ్నించారు. తాను ఇంకా పని చేయగలనని శరద్ పవార్ చెప్పారు.

శరద్ పవార్

ఎన్నికల్లో ఓడిపోయినా యూపీఏలో ప్రఫుల్ పటేల్ కేంద్రమంత్రి పదవి ఇప్పించా: శరద్ పవార్

బీజేపీ సూచన మేరకు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజబల్ వంటి తిరుగుబాటు నేతలు తనపై వ్యక్తిగత దాడులు చేశారని శరద్ పవార్ ఆరోపించారు. వంశపారంపర్య రాజకీయాలను ఎన్‌సీపీ ప్రోత్సహిస్తోందని అజిత్ పవార్ చేసిన ఆరోపణలపై శరద్ పవార్ మాట్లాడుతూ, తన మేనల్లుడు మహారాష్ట్రకు నాలుగుసార్లు ఉప ముఖ్యమంత్రిని చేశానని అజిత్‌పై కౌంటర్ ఎటాక్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినా యూపీఏలో ప్రఫుల్ పటేల్ కు కూడా మంత్రి పదవి ఇచ్చినట్లు ఈ సందర్భంగా శదర్ పవార్ గుర్తు చేశారు. యూపీఏలో పీఏ సంగ్మా కుమార్తెకు కేంద్ర మంత్రి పదవి దక్కిందని, తన కూతురు సుప్రియ(సూలే)కి ఇంకా ఆ అవకాశం రాలేదన్నారు. ఆ వాదన తప్పు అని శదర్ పవార్ వాదించారు.

శరద్ పవార్

శివసేన వేరు, బీజేపీ వేరు: శరద్ పవార్

2014, 2017, 2019లో కూటమి ప్రభుత్వం కోసం తమ పార్టీ బీజేపీతో చర్చలు జరిపిందని, అయితే సైద్ధాంతిక విభేదాల కారణంగా కాషాయ పార్టీతో ముందుకు వెళ్లకూడదని తాము నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పోత్తుల ప్రక్రియ అనేది ఒక భాగమని, ఇందులో తప్పులేదని స్పష్టం చేశారు. శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరాలన్న అజిత్ పవార్ నిర్ణయంపై శరద్ పవార్ మాట్లాడుతూ.. శివసేనకు, బీజేపీకి మధ్య తేడా ఉందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్‌తో శివసేన పొత్తు పెట్టుకున్నదని గుర్తుచేశారు.