Page Loader
Honeymoon Couple Missing: హనీమూన్‌కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ మృతదేహానికి పోస్టుమార్టం.. నివేదికలో సంచలన విషయాలు 
హనీమూన్‌కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ మృతదేహానికి పోస్టుమార్టం.. నివేదికలో సంచలన విషయాలు

Honeymoon Couple Missing: హనీమూన్‌కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ మృతదేహానికి పోస్టుమార్టం.. నివేదికలో సంచలన విషయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

హనీమూన్‌ సందర్భంగా మేఘాలయలో హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆయన మృతదేహంపై నిర్వహించిన శవ పరీక్ష పూర్తి అయింది. అందులో తలకు తీవ్రంగా గాయాలైనట్లు బయటపడింది. ఈ విషయాన్ని సంబంధిత మీడియా నివేదికలు వెల్లడించాయి. ఈ నెల 11న రాజా రఘువంశీ,సోనమ్‌ల వివాహం ఘనంగా జరిగింది. కొత్తగా వివాహితులైన ఈ జంట మే 20న హనీమూన్‌ కోసం మేఘాలయా రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ మే 22న వారు ఓ ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకొని మౌలాకియాత్‌ అనే గ్రామానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. వారు బైక్‌ను ఆ గ్రామంలో నిలిపి,ప్రముఖ పర్యాటక ఆకర్షణగా పేరుగాంచిన 'లివింగ్ రూట్‌ వంతెన'ను చూడటానికి వెళ్లినట్లు సమాచారం.

వివరాలు 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజీపుర్‌లో సోనమ్‌

అయితే ఆ తర్వాత ఈ జంట ఆచూకీ గల్లంతైంది. అదృశ్యమైన 11 రోజుల అనంతరం, మే 22న అదృశ్యమైన రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు సోహ్రా ప్రాంతంలోని ఓ జలపాతం సమీపంలోని లోతైన లోయలో గుర్తించారు. మృతదేహంపై కత్తితో చేసిన గాయాలు ఉండటంతో పోలీసులు హత్యకేసుగా భావిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టుమార్టం నివేదిక ప్రకారం, అతని తలకు తీవ్ర గాయాలైనట్లు, శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు వెల్లడైంది. ఈ కేసు నేపథ్యంలో, కనిపించకుండా పోయిన సోనమ్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజీపుర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను భర్తను హత్య చేయలేదని, కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్‌ చేశారని ఆమె చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.