Page Loader
DK Shivakumar: బెంగళూరు తొక్కిసలాట ఘటన .. మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకున్న డీకే శివకుమార్‌
బెంగళూరు తొక్కిసలాట ఘటన .. మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకున్న డీకే శివకుమార్‌

DK Shivakumar: బెంగళూరు తొక్కిసలాట ఘటన .. మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకున్న డీకే శివకుమార్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయోత్సవ వేడుక తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియం బయట ఏర్పడిన తీవ్ర తొక్కిసలాట ఘటన 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటనపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి లోనై కన్నీళ్లతో స్పందించారు.

వివరాలు 

అందుకే వేడుకను త్వరగా ముగించాల్సి వచ్చింది: డీకే శివకుమార్

డీకే శివకుమార్ మాట్లాడుతూ, "ఈ ప్రమాదంలో 15 సంవత్సరాల వయస్సున్న టీనేజ్ బాలలు కూడా ప్రాణాలు కోల్పోయారు. నేను స్వయంగా కనీసం 10 మంది మృతదేహాలను దగ్గర నుంచి చూశాను. ఇలాంటి విషాదాన్ని ఏ కుటుంబమూ తట్టుకోలేరు. ఓ తల్లి తన కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టం లేకుండానే అప్పగించమని వేడుకుంది. కానీ అది న్యాయపరంగా సాధ్యపడదు, ఎందుకంటే పోస్టుమార్టం అనేది తప్పనిసరి నిబంధన," అని తెలిపారు. పరిస్థితి క్షణాల్లోనే చేయిదాటిపోయినట్లు చెప్పారు."బుధవారం ఘటన జరిగిన వెంటనే పోలీస్ కమిషనర్ నన్ను సంప్రదించి వివరాలు తెలిపారు.అప్పటికే ఒకరు లేదా ఇద్దరు మరణించారని చెప్పారు.వెంటనే కార్యక్రమాన్ని పది నిమిషాల్లో ముగించమని ఆయన నన్ను కోరారు.అందుకే వేడుకను త్వరగా ముగించాల్సి వచ్చింది," అని డీకే శివకుమార్ వివరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న డీకే శివకుమార్