Page Loader
మోదీపై ప్రియాంక పోటీ చేస్తే గెలుపు పక్కా..శివసేన సంజయ్‌ రౌత్ సంచలన వ్యాఖ్యలు
మోదీపై ప్రియాంక పోటీ చేస్తే గెలుపు పక్కా

మోదీపై ప్రియాంక పోటీ చేస్తే గెలుపు పక్కా..శివసేన సంజయ్‌ రౌత్ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 14, 2023
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

రానున్న సార్వత్రిక ఎన్నికల(2024 ఎలక్షన్స్)పై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసిలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం వారణాసి ప్రజలు ప్రియాంకానే ఎంపీగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో ఆమె వారణాసి నుంచి బరిలో దిగాలని, ఈ మేరకు తప్పక విజయం సాధిస్తారని సంజయ్ కుండబద్దలు కొట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయబరేలీ, వారణాసి, అమేథీలో బీజేపీకి గట్టిపోటీ ఉంటుందన్నారు.

details

ప్రియాంక ఎంపీ అయ్యేందుకు పార్టీ ప్రణాళిక గీస్తోందని భావిస్తున్నా : రాబర్ట్ వాద్రా 

మరోవైపు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక పోటీపై రెండు రోజుల క్రితమే ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకకు పార్లమెంట్‌లో అడుగుపెట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నట్లు తాను భావిస్తున్నానన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ తగిన ప్రణాళిక సిద్ధం చేస్తుందని ఆశిస్తున్నట్లు వాద్రా చెప్పారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్ తన మేనల్లుడు అజిత్ పవార్‌ మధ్య జరిగిన భేటీపై సంజయ్‌ రౌత్‌ స్పందించారు. ప్రధాని మోదీ, పాక్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను కలుసుకుంటే లేంది, మామ, అల్లుళ్లు కలుసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. అజిత్‌- శరద్‌ భేటీకి ప్రాధాన్యత అక్కర్లేదన్నారు. ప్రతిపక్షాల కూటమి ఇండియా సదస్సుకు బహుశ అజిత్‌ను ఆహ్వానించి ఉండొచ్చని భావిస్తున్నట్లు రౌత్ అభిప్రాయపడ్డారు.