Page Loader
Metro Fare Rise: మెట్రో ప్రయాణికులకు షాక్.. త్వరలో పెరుగనున్న ఛార్జీలు

Metro Fare Rise: మెట్రో ప్రయాణికులకు షాక్.. త్వరలో పెరుగనున్న ఛార్జీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2025
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలోనే భారీ షాక్ ఎదురవనుంది. ఈ నెల 10వ తేదీ నుంచి మెట్రో రైలు టికెట్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (ఎఫ్ఎఫ్సీ) అందించిన నివేదిక ఆధారంగా ధరల పెంపు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మెట్రో అధికారులు, ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకొని చార్జీల పెంపుకు ఆమోదం పొందాలని యత్నిస్తున్నారు. కరోనా కారణంగా గతంలో ఏడాదిపాటు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో మెట్రో సంస్థపై ఆర్థిక భారం పెరిగింది. ప్రస్తుతం ఈ నష్టం దాదాపు రూ.6,598 కోట్లకు చేరినట్లు సమాచారం.

Details

రోజుకు రూ.1200 సర్వీసులు

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజుకు సుమారు 1,200 సర్వీసులు నడుస్తుండగా, సగటున 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వారం చివరలో ఈ సంఖ్య 5.10 లక్షల వరకు పెరుగుతోంది. ఎల్ అండ్ టీ మెట్రోకు ఎఫ్ఎఫ్సీ నివేదిక ఆధారంగా టికెట్ ధరలు పెంచే స్వతంత్ర అధికారం ఉంది. మెట్రో రైల్వే (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్-2002 ప్రకారం ధరలు సవరణకు తగిన ప్రక్రియ మొదలైంది. మెట్రో అధికారులు ప్రస్తుత ధరల కంటే 25-30 శాతం మేర పెంపు చేసే ప్రణాళికలో ఉన్నారు. ఈ పెంపుతో ప్రతి ఏడాది రూ.150 నుంచి రూ.170 కోట్లు అదనంగా ఆదాయం పొందగలమన్న ఆశతో ఉన్నారు.

Details

 పెరిగే మెట్రో చార్జీల అంచనా ఇలా 

0-2 కిలోమీటర్లు: రూ.10 → రూ.15 2-4 కిలోమీటర్లు: రూ.15 → రూ.20 4-6 కిలోమీటర్లు: రూ.25 → రూ.35 6-8 కిలోమీటర్లు: రూ.30 → రూ.40 8-10 కిలోమీటర్లు: రూ.35 → రూ.45 10-14 కిలోమీటర్లు: రూ.40 → రూ.55 14-18 కిలోమీటర్లు: రూ.45 → రూ.60 18-22 కిలోమీటర్లు: రూ.50 → రూ.65 22-26 కిలోమీటర్లు: రూ.55 → రూ.70 26 కిలోమీటర్ల పైగా: రూ.60 → రూ.75