Page Loader
తల్లిని చంపి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన మహిళ 
బెంగళూరు: తల్లిని చంపి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన మహిళ

తల్లిని చంపి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన మహిళ 

వ్రాసిన వారు Stalin
Jun 13, 2023
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని ఓ రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌లో 39 ఏళ్ల మహిళ తన తల్లిని హత్య చేసింది. అంతేకాదు ఆ మృతదేహాన్ని ఓ ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు ఆ ట్రాలీ బ్యాగ్ ను తెరిచి చూడగా అందులో మృతదేహాన్ని చూసి అవాక్కయ్యారు. ఈ మేరకు నిందితురానిని సెనాలి సేన్ (39)గా పేర్కొన్న పోలీసులు, ఆమెను అరెస్టు చేసి, కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సెనాలి సేన్, బెంగళూరులో ఫిజియోథెరపిస్ట్ గా పని చేస్తున్నారు.

బెంగళూరు

నేరాన్ని ఒప్పుకున్న మహిళ 

సెనాలి సేన్ తన తల్లితో నిత్యం గొడవపడేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో సోమవారం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా, కోపోద్రిక్తురాలైన సెనాలి సేన్, తన తల్లిని హత్య చేసినట్లు చేసింది. ఈ విషయాన్ని సెనాలి సేన్ పోలీసులు ఎదుట ఒప్పుకుంది. నిందితురాలు సెనాలి సేన్ వివాహిత అని, అయితే నేరం జరిగిన సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు. సెనాలి సేన్ అత్త ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నా, హత్య ఒక గదిలో జరిగినందు వల్ల ఆమెకు కూడా తెలియదని పోలీసులు వెల్లడించారు.