Urine In Fruit Juice: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయం
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ఫ్రూట్ జ్యూస్ షాపులో జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయించడం కలకలం రేపింది. ఘజియాబాద్‌లోని ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్‌లో మూత్రాన్ని జ్యూస్‌లో కలిపి వినియోగదారులకు అందిస్తున్నారని ఆరోపణలతో స్థానికులు షాపులో పనిచేస్తున్న ఇద్దరిని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
పండ్ల రసం దుకాణంలో పనిచేసే ఇద్దరిని కొడుతున్న దృశ్యాలు కనిపించాయి. కొందరు స్థానికులు వాళ్లను ఆపేందుకు ప్రయత్నించారు. షాప్‌లో మూత్రం ఉన్నట్లు అనుమానిస్తున్న ఒక ప్లాస్టిక్ కంటైనర్ కనిపించింది. ఇలాంటి ఘటనలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, షాపులోని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నామిన పోలీసులు తెలిపారు.