NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / లక్నో: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపిన యువకుడు 
    తదుపరి వార్తా కథనం
    లక్నో: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపిన యువకుడు 
    లక్నో: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపిన యువకుడు

    లక్నో: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపిన యువకుడు 

    వ్రాసిన వారు Stalin
    Jun 08, 2023
    05:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలోని ఇందిరా‌నగర్‌లో గురువారం ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి, సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు.

    పారిపోయే ముందు బాధితురాలి మృతదేహాన్ని ఆమె ఇంట్లోనే ఫ్యాన్‌ను ఉరివేసుకున్నట్లు నిందితుడు వేలాడదీశాడు.

    నిందితుడిని షాహిద్‌గా గుర్తించారు. గురువారం మధ్యాహ్నం 1:00 నుంచి 1:30 గంటల మధ్య తక్రోహిలోని బాధితురాలి ఇంట్లోకి నిందితుడు చొరబడ్డాడని పోలీసులు తెలిపారు.

    ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడి చేసి సుత్తితో కొట్టి చంపేశాడు. షాహిద్‌తో బాధితురాలి మధ్య సంబంధం ఇతర వివరాలను ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

    యూపీ

    హత్యాచారంపై స్థానికుల్లో ఆగ్రహం

    బాధితురాలి తల్లిదండ్రులు జీవనోపాధి కోసం ఇస్త్రీ షాపు నడుపుతుంటారు. బాలిక తల్లిదండ్రులు ఇస్త్రీ దుకాణానికి వెళ్లిన సమయంలో షాహిద్‌ ఇంట్లోకి ప్రవేశించి ఈ నేరానికి పాల్పడ్డాడు.

    తన భార్య ఇంటికి తిరిగి వచ్చే సరికి వరండాలో షాహిద్ నిలబడి ఉన్నాడని బాధితురాలి తండ్రి చెప్పాడు.

    తన భార్య షాహిద్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమెను తోసేసి పారిపోయినట్లు వివరించాడు.

    తలకు గాయం కావడంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    ఈ ఘటన స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. బాధితురాలికి త్వరగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    హత్య
    లక్నో
    తాజా వార్తలు

    తాజా

    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్

    ఉత్తర్‌ప్రదేశ్

    యూపీ: అక్రమ ఆయుధాల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు
    ఉత్తర్‌ప్రదేశ్: ఆక్రమణల తొలగింపు సమయంలో ఇంటికి నిప్పు! తల్లీ, కూతురు సజీవ దహనం అగ్నిప్రమాదం
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఎన్ఐఏ
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ యోగి ఆదిత్యనాథ్

    హత్య

    ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన బెల్జియం
    Andrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య రష్యా
    యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య మహారాష్ట్ర
    పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్ పాకిస్థాన్

    లక్నో

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన ఉత్తర్‌ప్రదేశ్
    లక్నో కోర్టులో తూపాకీ కాల్పులు; గ్యాంగ్‌స్టర్ హత్య  భారతదేశం

    తాజా వార్తలు

    రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు రక్షణ శాఖ మంత్రి
    భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం: వైట్ హౌస్  అమెరికా
    ఒడిశా రైలు విషాదం: ఇంకా గుర్తించని 101 మృతదేహాలు  ఒడిశా
    కోల్ ఇండియాలో వాటాను విక్రయించి రూ.4,185.31 కోట్లు సమీకరించిన ప్రభుత్వం  ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025