LOADING...
SBI ATM Gun Fire: కోఠి ఎస్‌బీఐ ఏటీఎమ్‌ వద్ద కాల్పులు.. రూ.6 లక్షల నగదు దోపిడీ
కోఠి ఎస్‌బీఐ ఏటీఎమ్‌ వద్ద కాల్పులు.. రూ.6 లక్షల నగదు దోపిడీ

SBI ATM Gun Fire: కోఠి ఎస్‌బీఐ ఏటీఎమ్‌ వద్ద కాల్పులు.. రూ.6 లక్షల నగదు దోపిడీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2026
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ నగరంలోని కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయ ఏటీఎమ్‌ వద్ద శనివారం ఉదయం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. గన్‌తో కాల్పులు జరిపిన అఘాంతకులు రూ.6 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి బులెట్‌ గాయం కావడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. ఉదయం సుమారు 7 గంటల సమయంలో రషీద్‌ అనే వ్యక్తి ఏటీఎమ్‌లో డబ్బులు డిపాజిట్‌ చేయడానికి అక్కడికి చేరుకున్నాడు. అతడిని ముందుగానే గమనించిన దుండగులు వెనక నుంచి అనుసరిస్తూ వచ్చారు. రషీద్‌ ఏటీఎమ్‌ వద్దకు చేరుకున్న వెంటనే అతడిపై గన్‌తో కాల్పులు జరిపి, అతని వద్ద ఉన్న రూ.6 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.

Details

రషీద్ కు కాలికి బులెట్ గాయం

కాల్పుల ఘటనలో రషీద్‌కు కాలికి బులెట్‌ గాయం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న సుల్తాన్‌ బజార్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఏటీఎమ్‌ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నగదు దోపిడీతో పాటు కాల్పులు జరగడం కోఠి ప్రాంతంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Advertisement