Karnataka: ముదిరిన కన్నడ భాషా వివాదం..దుకాణాల ఇంగ్లిష్ నేమ్‌ప్లేట్‌లు ధ్వంసం చేసిన నిరసనకారులు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రక్షణ వేదికకు చెందిన కన్నడ అనుకూల కార్యకర్తలు బుధవారం ఇంగ్లీష్ లో ఉన్న అన్ని సైన్‌బోర్డ్‌లను ధ్వంసం చేశారు.
అన్ని సంస్థల సైన్‌బోర్డ్‌ల పై '60% కన్నడ' ఉండాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దింతో కర్ణాటకలో భాషా వివాదం మరింత ముదిరింది.
కొందరు కార్యకర్తలు ఇంగ్లిష్ సైన్ బోర్డులను చింపివేయగా, మరికొందరు ఆంగ్ల అక్షరాలపై నల్ల ఇంకు చల్లారు.
చాలా మంది నిరసనకారులు,ఎక్కువగా పసుపు,ఎరుపు కండువాలు (కన్నడ జెండా రంగులు) ధరించి షాప్ లలోకి ప్రవేశించి ఇంగ్లీష్ లో వ్రాసిన సైన్ బోర్డులను ధ్వంసం చేశారు.
పోలీసుల రంగంలోకి దిగడంతో ఆందోళన సద్దుమణిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసు అధికారులు లాఠీచార్జి చేసి కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
Details
నేమ్ బోర్డులపై తప్పనిసరిగా కన్నడ.. పాటించని వారిపై కఠిన చర్యలు
ఫిబ్రవరి 28లోగా నేమ్‌బోర్డులపై కన్నడ నిబంధనలను 60 శాతం పాటించని దుకాణాలు, హోటళ్లు, మాల్స్‌ల లైసెన్సులను సస్పెండ్ చేస్తామని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ప్రకటించిన మరుసటి రోజే ఈ నిరసనలు వెల్లువెత్తాయి.
అన్ని హోటళ్లు, మాల్స్,ఇతర దుకాణాలు తప్పనిసరిగా తమ నేమ్ బోర్డులపై తప్పనిసరిగా కన్నడను ఉపయోగించాలని, నగర పౌర సంఘం ఆదేశించింది. పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
బెంగళూరులో 1,400 కి.మీ ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లు ఉన్నాయి. సైన్‌బోర్డ్‌లపై కన్నడ భాష వినియోగానికి సంబంధించి నిబంధనలను పాటించిన దుకాణాలను నోట్ చేయడానికి సర్వే చేయబడుతుంది.