Page Loader
Shashi Tharoor: 'కాలుష్యం తీవ్రమవుతున్నందున ఢిల్లీ భారత రాజధానిగా ఉండాలా..?' శశిథరూర్‌ పోస్ట్‌ వైరల్‌
'కాలుష్యం తీవ్రమవుతున్నందున ఢిల్లీ భారత రాజధానిగా ఉండాలా..?'

Shashi Tharoor: 'కాలుష్యం తీవ్రమవుతున్నందున ఢిల్లీ భారత రాజధానిగా ఉండాలా..?' శశిథరూర్‌ పోస్ట్‌ వైరల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2024
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు పొగమంచు కమ్ముకోవడం వల్ల గాలి నాణ్యత మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తాజాగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ''ఇలాంటి పరిస్థితుల్లో దిల్లీ ఇంకా దేశ రాజధానిగా కొనసాగాలా?'' అంటూ ప్రశ్నించారు.

వివరాలు 

కాలుష్య స్థాయిలపై శశిథరూర్ గణాంకాలు

కాలుష్య స్థాయిలపై గణాంకాలు అందిస్తూ శశిథరూర్ ఒక టేబుల్‌ను పోస్ట్‌ చేశారు. ఆయన వ్యాఖ్యానిస్తూ, ''దిల్లీ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాల మోతాదు నాలుగు రెట్లు పెరిగింది.రెండో స్థానంలో ఉన్న ఢాకా (బంగ్లాదేశ్ రాజధాని)తో పోలిస్తే,దిల్లీలో ఈ ప్రమాదకర స్థాయి ఐదు రెట్లు అధికంగా ఉంది. ఇలాంటి పరిస్థితులు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నా, కేంద్ర ప్రభుత్వం దీని పై తీవ్రంగా స్పందించలేదు.నవంబర్ నుంచి జనవరి వరకు ఈ నగరం నివాసానికి అనుకూలంగా ఉండడం లేదని, మిగతా కాలంలోనూ ప్రజలు జీవనం సాగించడం కష్టసాధ్యమని''ఆయన అన్నారు. శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు దిల్లీలో పెరుగుతున్న కాలుష్యానికి గల కారణాలు,దీని ప్రభావం,అలాగే రాజధానిగా దిల్లీ కొనసాగింపుపై చర్చను మరింత ఉధృతం చేశాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శశిథరూర్ చేసిన ట్వీట్