LOADING...
Pm modi:'జైలు నుంచి ప్రభుత్వం ఎందుకు న‌డ‌పాలి?'ప్ర‌శ్నించిన ప్ర‌ధాని మోదీ
Pm modi:'జైలు నుంచి ప్రభుత్వం ఎందుకు న‌డ‌పాలి?'ప్ర‌శ్నించిన ప్ర‌ధాని మోదీ

Pm modi:'జైలు నుంచి ప్రభుత్వం ఎందుకు న‌డ‌పాలి?'ప్ర‌శ్నించిన ప్ర‌ధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లోని గయాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ, "జైలు నుంచి ప్రభుత్వం ఎందుకు న‌డ‌పాలి ?" అని ప్రశ్నించారు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి 50 గంటలపాటు జైలులో ఉంటే, ఆ వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోతాడని మోదీ చెప్పారు. అది డ్రైవర్, క్లర్క్, లేదా ఏ ఇతర ఉద్యోగి అయినా కూడా వర్తిస్తుంది. కానీ, ముఖ్యమంత్రులు, మంత్రులు జైలులో ఉండి కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అని ఆయన అన్నారు.

వివరాలు 

ఎన్డీఏ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా చట్టం 

మోదీ గడిచిన కాలంలో కొందరు జైలు నుంచి ఫైల్స్‌పై సంతకాలు చేసి, ఆదేశాలు ఇచ్చేవారని గుర్తు చేశారు. ఒక‌వేళ ప్ర‌జానేత‌కు అటువంటి వ్య‌క్తిత్వం ఉంటే, అప్పుడు మ‌నం అవినీతిని ఎలా ఎదుర్కుంటామ‌ని ప్ర‌ధాని ప్ర‌శ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టం ప్రకారం ప్రధాని కూడా భవిష్యత్తులో దాని పరిధిలోకి వస్తారని మోదీ స్పష్టం చేశారు. ఆ చట్టం ఆమోదం పొందినప్పుడు, జైలులో ఉన్న ప్రధాని, ముఖ్యమంత్రి సైతం 31వ రోజు వరకు తమ పదవిని కోల్పోతారని ఆయన చెప్పారు. ఇక, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్ళకు ఈరోజు గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వ‌హించగా, మోదీ ప్రత్యేకంగా పాల్గొన్నారు.

వివరాలు 

చాణ‌క్యుడు, చంద్ర‌గుప్తుడు.. ఏలిన ప్ర‌దేశం బీహార్ 

గ్రామీణ పథకం కింద 12,000 మంది లబ్ధిదారులు, నగర పథకం కింద 4,000 మంది లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో ఉండగా, ఆయన వారిని ఉద్దేశించి బీహార్ రాష్ట్రం కీర్తిని గుర్తుచేశారు. చాణ‌క్యుడు, చంద్ర‌గుప్తుడు.. ఏలిన ప్ర‌దేశం బీహార్ అని పేర్కొన్నారు. రాష్ట్రం ఎల్లప్పుడూ దేశానికి వెన్నుముకగా నిలిచిందని, ఇక్కడ జరిగిన దీక్షలు దేశాన్ని బలోపేతం చేశాయని మోదీ తెలిపారు. పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి జ‌రిగిన స‌మ‌యంలో ఉగ్ర‌వాదుల‌ను అణిచివేస్తామ‌ని ఇక్క‌డ నుంచే పేర్కొన్న‌ట్లు చెప్పారు. ఆ శ‌ప‌ధం తీరింద‌ని, ప్ర‌పంచం కూడా ప్ర‌త్య‌క్షంగా చూసింద‌న్నారు. అలాగే, ఆర్జేడీ పాలనలో గయాజీ వంటి పట్టణాలు చీకటిలోకి వెళ్ళిపోయినట్లు, అనేక కుటుంబాలు ఇక్కడి నుంచి వలస వెళ్ళినట్లు ఆయన ఆరోపించారు.

వివరాలు 

బీహారీ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి

ఆర్జేడీ ప్రభుత్వం బీహారీ ప్రజలను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూసిందని, వారి జీవితాలు, బాధలు, గౌరవం గురించి విపక్షం ఆలోచించలేదని ఆయన పేర్కొన్నారు. మోదీ చివరగా, ఎన్డీఏ ప్రభుత్వం బీహారీ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నది, అలాగే స్థానిక యువత తాము పెరిగిన కుటుంబాలతో ఉంటే అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నది అని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీహార్ లో నరేంద్ర మోదీ