
Siddaramaiah: ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యకు ఊరట.. సంచలన కేసులో క్లీన్‌చిట్
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూ కేటాయింపుల వివాదంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో,సీఎం సిద్ధరామయ్య,వారి కుటుంబ సభ్యులకు కమిషన్ నుండి క్లీన్‌చిట్ మంజూరు చేయబడింది. ముడా కేసులో ఎదురైన అన్ని ఆరోపణలు నిరాధారమైనవి, అసత్యమైనవి అని జస్టిస్ పీ.ఎన్. దేశాయ్ నేతృత్వంలోని ఏకసభ్య విచారణ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు కమిషన్ తన నివేదికను సమర్పించింది. దీంతో, సిద్దరామయ్యకు ఉపశమనం లభించింది.
వివరాలు
14 స్థలాలను అక్రమంగా కేటాయించారన్న విమర్శలు బయటకు
వివరాల ప్రకారం, ముడా భూముల కేటాయింపు వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, ఇతర కుటుంబ సభ్యులపై భూములను అక్రమంగా కేటాయించారని ఆరోపణలు వచ్చాయి. మొత్తం 14 స్థలాలను అక్రమంగా కేటాయించారన్న విమర్శలు బయటకు వచ్చాయి. అయితే, విచారణలో ఈ ఆరోపణలకు ఏ విధమైన ఆధారాలు లేవని, చట్టం ఉల్లంఘించబడలేదని పీ.ఎన్. దేశాయ్ కమిషన్ స్పష్టంగా పేర్కొంది. డీ-నోటిఫై అయిన భూములను ముడా తిరిగి వినియోగించుకున్నందున, భూమి యజమానులకు పరిహారంగా స్థలాలు కేటాయించడం చట్ట ప్రకారం సరైనదే అని నివేదికలో వెల్లడించింది. ఈ విధంగా,ముడా కేసులో సీఎం సిద్ధరామయ్య,ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు అసత్యమని,నిరాధారమని విచారణ కమిషన్ స్పష్టం చేసింది.
వివరాలు
కొంతమంది ముడా అధికారుల పనితీరుపై కమిషన్ తీవ్ర అభ్యంతరాలు
ఇదే విషయాన్ని ముందుగా పరిశీలించిన కర్ణాటక లోకాయుక్త కూడా ధృవీకరించింది. సరైన ఆధారాలు లేకపోవడం వలన ఈ కేసుకు క్లోజర్ రిపోర్ట్ ఇచ్చినట్లు వెల్లడైంది.ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదించినట్టు న్యాయ,పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్,ఇటీవల కేబినెట్ సమావేశం అనంతరం విధాన సౌధంలో మీడియాకు తెలిపారు. ఇంతేకాదు, కొంతమంది ముడా అధికారుల పనితీరుపై కమిషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2020 నుంచి 2024 మధ్య పనిచేసిన కొంతమంది కమిషనర్లు నిబంధనలకు విరుద్ధంగా, తమకు ఇష్టమైనట్లు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించారని కమిషన్ గుర్తించింది. ఈ అక్రమాలపై సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కు సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల మేరకు, ప్రభుత్వం ఇప్పటికే చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్..
The commission headed by retired judge P.N. Desai gives a clean chit to the family of Chief Minister Siddaramaiah in the MUDA 'scam'.@nagarjund with more details.#MUDAScam #ITVideo #Karnataka pic.twitter.com/IWfF00GVRc
— IndiaToday (@IndiaToday) September 5, 2025