CM Siddaramaiah: ముడా భూ కుంభకోణం కేసులో లోకాయుక్త పోలీసుల ఎదుట హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ముడా ఇంటి స్థలాల అవినీతి కేసులో ఏ1 నిందితుడిగా మైసూరులోని లోకాయుక్త కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ కోసం, చన్నపట్టణ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను రద్దు చేసుకుని ఆయన కార్యాలయానికి వెళ్లారు.సుమారు రెండు గంటల పాటు లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ సిద్దరామయ్యను విచారించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్దరామయ్య, "లోకాయుక్త అధికారులు నోటీసులు ఇచ్చారు కాబట్టి నేను విచారణకు హాజరయ్యాను. ఇది నాకు అవమానం కాదు" అన్నారు. ఆ సమయంలో ఆయనకు 30-35 ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు.తనకు తెలిసిన సమాధానాలు ఇచ్చానని పేర్కొన్నారు."ఇది ఒక తప్పు కేసు.మేము ఇంటి స్థలాలను తిరిగి ఇవ్వడం అంటే నేరం అంగీకరించడం కాదు"అని సిద్దరామయ్య స్పష్టం చేశారు.
ఆరోపణలకు విసుగు చెంది..
ఆరోపణలకు విసుగు చెంది తన భార్య ఆ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. "కోర్టు తీర్పు వచ్చే వరకు ఇది కేవలం ఒక ఆరోపణ మాత్రమే. నా రాజకీయ జీవితం లో ఇది ఒక చిన్న మచ్చగా ఉండబోతుంది" అని సిద్దరామయ్య తెలిపారు.