స్కిల్ డెవలప్‌మెంట్ పై మాజీ ఎండీ కీలక వ్యాఖ్యలు..ఎటువంటి స్కామ్ జరగలేదని స్పష్టం
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‍మెంట్ స్కామ్ కేసులో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐడీ ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని కొట్టిపడేశారు. స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఎటువంటి స్కామ్ జరగలేదని కుండబద్దలు కొట్టారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ఏకైక లక్ష్యమని వెల్లడించారు. 2014లో ఐటీ అభివృద్ధికి అప్పటి ప్రభుత్వం ముందుకు రాగా, 200కు పైగా ల్యాబ్‍లను దేశవ్యాప్తంగా ప్రారంభించామన్నారు. సీమెన్స్, APSSDC మధ్య ఒప్పందం ఉందని, సాప్ట్ వేర్‍పై యువతకు అవగాహన కల్పిస్తే దానికి డిమాండ్ పెరుగుతుందనేది తమ ఉద్దేశమన్నారు. 2021 వరకు దాదాపుగా 2.32 లక్షల మందికి శిక్షణ అందించి ప్రభుత్వానికే ప్రాజెక్టును అప్పగించామన్నారు. ప్రాజెక్టు విజయవంతమైందని APSSDC ఎండీ సైతం కితాబిచ్చారని బోస్ గుర్తుచేశారు.