భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం.. 300 మంది పర్యాటకులను రక్షించిన అధికారులు
ఈ వార్తాకథనం ఏంటి
భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలమవుతోంది. నాలుగు రోజులగా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి.
ఈ వరదల్లో సూమారు 3500 పర్యాటకులు ఉత్తరసిక్కిం జిల్లాలో చిక్కుపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. వారిలో దేశీయ పర్యాటకులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. గురువారం నుంచి ఉత్తర సిక్కింలోని మంగాన్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.
దీంతో పెంగాగ్ సప్లయ్ ఖోలా వద్ద మంగాన్ జిల్లా కేంద్రం నుంచి చుంగ్‌థాంగ్ వెళ్లే రోడ్డును వరద ముంచెత్తింది. దీనివల్ల రోడ్లు కోతకు గురై, పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
లిచెన్, లచుంగ్ ప్రాంతాల్లో ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకులు అక్కడి హోటళ్లలోని చిక్కుపోయారని అధికారులు తెలిపారు. దీంతో పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు సిక్కిం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
Details
దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు చర్యలు
ఇప్పటికే 1500 మంది పర్యాటకులను వరద ప్రభావిత ప్రాంతాల నుంచి అధికారులు తరలించారు.
తాజాగా ఉత్తర సిక్కిం జిల్లాలోని లాచెన్, లాచుంగ్ ప్రాంతాల్లో చిక్కుపోయిన 300 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
వారికి భోజన, వైద్య సదుపయాలను అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ప్రస్తుతం సహాయక చర్యలు వేగంగా కొనసాగిస్తున్నట్లు సిక్కిం ప్రభుత్వం తెలిపింది.