
ఫేస్‌బుక్ ప్రేమ; ప్రియుడి కోసం భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన మహిళ; ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే!
ఈ వార్తాకథనం ఏంటి
అంజు అనే 35 ఏళ్ల భారతీయ మహిళ తన ఫేస్ బుక్ ప్రియుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాకు వెళ్లింది. ఈ ఘటన రెండు దేశాల్లో సంచనలంగా మారింది.
పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ తన పబ్‌జీ ప్రియుడిని కలవడానికి భారత్‌కు వచ్చిన ఉదంతం అనంతరం ఈ ఘటన జరగడం గమనార్హం.
అంజుకు ఇదివరకే పెళ్లి కావడం కొసమెరుపు. మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆమెకు 15 ఏళ్ల, ఆరేళ్ల పిల్లులు కుడా ఉన్నారు. అంజు స్వస్థలం రాజస్థాన్ లోని భివాడి జిలా.
సీమా అంశం వెలుగులోకి రాకముందే అంజు పాకిస్థాన్‌కు వెళ్లేందుకు చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అంజు ప్రియుడు నస్రుల్లా పాకిస్థాన్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు.
పాక్
గాఢ ప్రేమలో మునిగిపోతున్న అంజు- నస్రుల్లా
అంజు- నస్రుల్లా ఇద్దరూ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. అనంతరం అది ప్రేమగా మారింది.
ప్రస్తుతం అంజు- నస్రుల్లా ఇద్దరూ గాఢ ప్రేమలో మునిగిపోతున్నట్లు తెలుస్తోంది. నస్రుల్లా లేకుండా తాను ఉండలేనని అక్కడి అధికారులకు అంజు తెలియజేసింది.
అయితే వీరి ప్రేమ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు పాకిస్థాన్‌లోని భద్రతా వర్గాలు తెలిపాయి. విచారణ అనంతరం అన్ని వివరాలను తెలియజేస్తామని జిల్లా పోలీసు అధికారి (డీపీఓ) బాలా ముస్తాక్ ఖాన్ తెలిపారు.
ఈ ఘటనపై నస్రుల్లా స్పందించారు. అంజుతో తన నిశ్చితార్థం మరో రెండు మూడు రోజుల్లో జరగనుందని వెల్లడించాడు. ఈ విషయంలో మరెవరూ జోక్యం చేసుకోకూడదని తాము కోరుకుంటున్నట్లు చెప్పాడు.