
విద్యుదుత్పత్తిపై సింగరేణి ఫోకస్; ఇక లాభాలే లాభాలు!
ఈ వార్తాకథనం ఏంటి
సింగరేణి అనేగానే మనకు గుర్తుకొచ్చేది బొగ్గు. గనుల్లో వెలికి తీసిన బొగ్గును పరిశ్రమలు, విద్యుత్ సంస్థలకు విక్రయించడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే ఇప్పుడు సింగరేణి రూట్ మార్చింది. విద్యుత్ ఉత్పత్తి కోసం ఇతర సంస్థలకు బొగ్గును విక్రయించే బదులు, సొంతంగా విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెడుతోంది. తద్వారా భారీ లాభాలపై సింగరేణి దృష్టి సారిస్తోంది.
తొలుత జైపూర్‌లో 600మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన రెండు కేంద్రాలను సింగరేణి నిర్మించింది.
ఆ తర్వాత పలు ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్పి కేంద్రాలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ 15,485మెగావాట్లకు చేరింది.
ఇందులో ప్రస్తుతం సింగరేణి విద్యుత్ కేంద్రాల ద్వారానే 90శాతం కరెంటు రాష్ట్రానికి సరఫరా అవుతోంది. తద్వారా భారీ లాభాలను సింగరేణి ఆర్జిస్తోంది.
తెలంగాణ
రూ.4,371 కోట్ల విద్యుత్ అమ్మితే మిగులు రూ.500కోట్లు
రాష్ట్ర డిమాండులో 90శాతం విద్యుత్‌ను విక్రయించడం ద్వారా సింగరేణి దాదాపు రూ.500కోట్ల లాభాలను ఆర్జించింది. ఇది చాలా పెద్దమొత్తం అని చెప్పాలి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.28, 459కోట్ల టర్నోవర్ జరిగితే దాదాపు రూ.500కోట్ల లాభాలు వచ్చాయి.
అదే ఏడాది రూ.4,371 కోట్ల విద్యుత్‌ను అమ్మితే సంస్థకు దాదాపు రూ.500కోట్లు మిగిలాయి. విద్యుత్ అమ్మకంతో సింగరేణికి ఎంతటి లాభదాయకమో ఈ అంకెలను బట్టి చెప్పొచ్చు.
భవిష్యత్‌లో సొంత బొగ్గుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని సింగరేణి ఆలోచిస్తోంది.
ఇప్పటికే జైపూర్ లో కొత్తగా నిర్మించనున్న జైపూర్ 800మెగావాట్ల విద్యుత్ కేంద్రంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.