
Half Day Schools: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు..
ఈ వార్తాకథనం ఏంటి
మార్చి నెల ప్రారంభమైంది. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వడగాలులు మరింత తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో చిన్నారులు, వృద్ధులు అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ఎండ వేడిమి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇక విద్యార్థులు ఎండల తీవ్రత కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
వివరాలు
ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూళ్ల విధానం
ప్రతి ఏడాది ఎండల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒంటిపూట బడులను అమలు చేస్తారు.
ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను పరిశీలించి, మార్చి 15వ తేదీ నుంచి అన్ని బడుల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది.
దీనితో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ఇతర అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నాయి. ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూళ్ల విధానం కొనసాగనుంది.