Supreme Court: దేశవ్యాప్తంగా 'SIR' ను నిలిపివేయలేం.. పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న 'SIR' విధానాన్ని వెంటనే నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు పిటిషనర్లకు అనుకోని దెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం కీలకంగా ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎందుకంటే దేశంలోని అనేక రాష్ట్రాల్లో 'S.I.R.' ఇప్పటికే కొనసాగుతోందని, ఈ దశలో దానిని నిలిపివేయాలనడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టంచేసింది. అయితే, ఈ పిటిషన్లకు సంబంధించి కారణాలు, వివరాలతో కూడిన సమగ్ర సమాధానం సమర్పించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఈ విషయంపై తుది నిర్ణయం కోర్టు తదుపరి విచారణలో వెలువడనుంది.
వివరాలు
డిసెంబర్ 9న విచారణకు జాబితా
ఇదే సమయంలో, భారత ఎన్నికల సంఘం (ECI) నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (Special Intensive Revision - SIR) ను ప్రశ్నిస్తూ వచ్చిన పిటిషన్లపై విచారణ తేదీలను సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఈ అంశాలను పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో—కేరళకు సంబంధించిన పిటిషన్లు డిసెంబర్ 2న, తమిళనాడుకు సంబంధించినవి డిసెంబర్ 4న, పశ్చిమ బెంగాల్‌కు చెందినవి డిసెంబర్ 9న విచారణకు తీసుకోవాలని కోర్టు నిర్ణయించింది. దేశంలోని పలు రాష్ట్రాల ఓటర్ల జాబితా సవరణపై వచ్చిన సవాళ్లను ఒకేచోట సమీక్షించడానికి సుప్రీంకోర్టు చూపిన ఆసక్తి ప్రాధాన్యతను సంతరించుకుంది.