Page Loader
కోరుట్లలో తీవ్ర కలకలం.. అనుమానాస్పద స్థితిలో అక్క మృతి, బస్సు ఎక్కి వెళ్లిపోయిన చెల్లెలు
అక్క మృతి, చెల్లెలు అదృశ్యం

కోరుట్లలో తీవ్ర కలకలం.. అనుమానాస్పద స్థితిలో అక్క మృతి, బస్సు ఎక్కి వెళ్లిపోయిన చెల్లెలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 30, 2023
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘోరం జరిగిపోయింది. ఓ ఇంట్లో అక్క దీప్తి మృతిచెందగా, ఆమె చెల్లెలు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. భీమునిదుబ్బకు చెందిన 24 ఏళ్ల దీప్తి(అక్క) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. అయితే ప్రస్తుతం ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తోంది. ఆమె చెల్లెలు చందన బీటెక్ పూర్తి చేయగా, సోదరుడు సాయి బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. హైదరాబాద్‌లో బంధువుల గృహ ప్రవేశం నిమిత్తం దీప్తి తల్లిదండ్రులు శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులు ఆదివారం రాజధానికి పయనమయ్యారు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో పెద్ద కుమార్తెతో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం మరోమారు ఫోన్ చేయగా, దీప్తి ఫోన్ తీయలేదు.

details

చందన కోసం గాలిస్తున్న పోలీసులు

మరోవైపు చందన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు పక్కింటి వారికి ఫోన్ చేశారు. దీంతో బాధిత ఇంటికి వెళ్లిన ఇరుగు పొరుగుకు సోఫాలో దీప్తి మృతదేహం కనిపించడంతో షాకయ్యారు. వంటగదిలో 2 మద్యం సీసాలు, కూల్‌డ్రింక్, స్నాక్స్ ప్యాకెట్లు కనిపించాయి. దీంతో కుటుంబీకులకు వెంటనే సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరోవైపు చందన జాడ లేకపోవడంతో ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఉదయం 5.12 గంటల నుంచి 5 నిమిషాలపాటు ఓ యువకుడితో కలిసి బస్టాండ్‌లో ఉన్నట్టు సీసీటీవీలో రికార్డైంది. అనంతరం ఆమె నిజమాబాద్ బస్సు ఎక్కింది. మిస్టరీగా మారిన ఈ కేసులో చందన ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.