LOADING...
Sabarimala case: శబరిమల బంగారు తాపడాల కేసులో సంచలనం.. తంత్రి కందరారు రాజీవరు అరెస్టు
తంత్రి కందరారు రాజీవరు అరెస్టు

Sabarimala case: శబరిమల బంగారు తాపడాల కేసులో సంచలనం.. తంత్రి కందరారు రాజీవరు అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

శబరిమల బంగారు తాపడాల చోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో శబరిమల తంత్రి (ప్రధాన పూజారి) కందరారు రాజీవరు (Kandararu Rajeevaru)ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అధికారిక వర్గాల సమాచారం మేరకు... శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.30 గంటల సమయంలో సిట్ బృందం ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. అనంతరం కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభించడంతో అధికారికంగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో కందరారు రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.

వివరాలు 

బంగారు తాపడాల చోరీలో ప్రధాన పూజారి పాత్ర

బంగారు తాపడాల చోరీలో ఆయన పాత్ర కూడా ఉందని విచారణలో తేలడంతోనే అరెస్టు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఉన్నికృష్ణన్ పొట్టిని శబరిమలకు తీసుకువచ్చింది కూడా తంత్రి కందరారు రాజీవరేనని ఇతర నిందితులు తమ వాంగ్మూలాల్లో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. అలాగే, బంగారు తాపడాల దొంగతనం జరిగే విషయంపై ఆయనకు ముందుగానే సమాచారం ఉన్నట్లు కూడా విచారణలో బయటపడినట్లు పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శబరిమల ఆలయ ప్రధాన పూజారి అరెస్ట్

Advertisement