Assault on Doctor: ఢిల్లీలో వైద్యుడిపై దాడి.. భద్రతా నిబంధనలపై ఆసుపత్రుల్లో సమీక్షా
కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లు 11 రోజుల పాటు సమ్మె చేశారు. అయితే ఈ సమ్మె విరమించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఓ రెసిడెంట్ డాక్టర్, మెడికల్ డ్రెస్సర్‌పై దాడి జరగడం శోచనీయం. దిల్లీలోని కర్కర్‌దూమాలో ఉన్న డాక్టర్ హెడ్గేవార్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి 1 గంటకు తలపై గాయంతో ఓ వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడని. గాయానికి కుట్లు వేయడానికి ఆ పేషెంట్ ను డ్రెసింగ్ రూంలోకి తీసుకెళ్లాలని చెప్పారు.
ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు
అయితే కుట్లు వేసే సమయంలో పేషెంట్ దుర్భాషలాడి దాడి చేశాడని, పేషెంట్ కుమారుడు కూడా ముఖంపై కొట్టాడని బాధిత రెసిడెంట్ డాక్టర్ తెలిపారు. పేషెంట్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనను పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తానని డాక్టర్ తెలిపారు. భద్రతా ప్రోటోకాల్‌లను పునఃసమీక్షించి, భద్రతను 25శాతం మేర పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అన్ని ఆసుపత్రులకు ఆదేశించిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఢిల్లీలోని వందలాది రెసిడెంట్ డాక్టర్లు ఆగస్టు 23న తమ సమస్యలను పరిష్కరించి, రక్షణ కల్పించాలని సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే.