Page Loader
SLBC Tunnel Collapse: SLBC లోపలి దృశ్యాలు.. ముగింపు దశలో సహాయక చర్యలు.. స్పాట్‌కు రెస్క్యూ బృందాలు 
SLBC లోపలి దృశ్యాలు.. ముగింపు దశలో సహాయక చర్యలు..

SLBC Tunnel Collapse: SLBC లోపలి దృశ్యాలు.. ముగింపు దశలో సహాయక చర్యలు.. స్పాట్‌కు రెస్క్యూ బృందాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2025
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

SLBC టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశానికి గురువారం ఉదయం సహాయక బృందాలు అత్యంత సమీపంగా వెళ్లాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకొచ్చాయి.నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో, టన్నెల్ 14 కిలోమీటర్ల వద్ద ఫిబ్రవరి 22న ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ బోరింగ్ మెషిన్‌తో పనులు ప్రారంభించగానే, ఒక్కసారిగా భూమి కంపించడంతో సొరంగ మార్గం తీవ్రంగా దెబ్బతిన్నది. టన్నెల్ పైభాగం కుప్పకూలడంతో కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 40 మంది కార్మికులు సురక్షితంగా బయటపడగా,మరో 8 మంది ఇప్పటికీ లోపలే చిక్కుకుపోయారు. అప్పటి నుంచీ సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తూనే ఉన్నాయి.మట్టికి తడిగా మారడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

వివరాలు 

ప్రమాద స్థితి - ఐదు రోజులు గడిచినా మార్పులేదా? 

ఐదు రోజుల సహాయక చర్యల తర్వాత కూడా లోపల చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల జాడ తెలియలేదు. టన్నెల్ లోపల నీరు నిలిచిపోయి, భారీగా పూడిక పేరుకుపోవడంతో శిథిలాలు తొలగించే ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. సహాయక బృందాలు టన్నెల్‌ను మరింతగా దెబ్బతీయకుండా మట్టిని, నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. టన్నెల్‌లో ఉన్న బోరింగ్ మెషిన్, ఇతర పరికరాలను తొలగించి ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బురద తీవ్రంగా పేరుకుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా, టన్నెల్ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడాన్ని బృందాలు విరమించుకున్నాయి.

వివరాలు 

సహాయక బృందాల కృషి - భద్రతా చర్యలు 

మంగళవారం రాత్రి సహాయక బృందాలు ప్రమాద స్థలానికి 15 మీటర్ల దూరంలో చేరుకున్నాయి. అయితే, ఆ ప్రాంతం పూర్తిగా బురద, మట్టితో నిండిపోవడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ సపోర్ట్ లేకపోవడంతో, అక్కడ పనిచేస్తున్న బృందాలు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. గురువారం ఉదయం ఆక్సిజన్ సహాయంతో మరింత లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చివరికి 'జీరో పాయింట్' వరకు చేరుకోగలిగాయి. అయినప్పటికీ, కార్మికుల ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రమాద ప్రాంతంలో భారీగా పేరుకుపోయిన బురదను తొలగించే పనులు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటపడతారనే ఆశతో సహాయక బృందాలు విశ్వాసంతో పనిచేస్తున్నాయి.