
Anagani Satya Prasad: ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' విధానాన్ని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు.
మొదటి దశలో, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉన్న ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం అమలులోకి తీసుకువచ్చారు.
మిగతా కార్యాలయాల్లో ఈ నెలాఖరుకు ముందుగా ప్రణాళిక ప్రకారం దశలవారీగా అమలు చేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ, పేదలకు న్యాయం కలగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వ్యాపారులు, ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు మరింత సులభతర సేవలు అందించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. ఈ రకమైన నూతన సంస్కరణలు అవినీతికి అవకాశం లేకుండా చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'స్లాట్ బుకింగ్' ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్
ఏపీ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్
— BIG TV Breaking News (@bigtvtelugu) April 4, 2025
తొలి విడతలో భాగంగా 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులోకి స్లాట్ బుకింగ్ విధానం
మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరులోకా దశలవారీగా ప్రారంభిస్తామన్న మంత్రి సత్య… pic.twitter.com/OZzCe0pUmu