
Heavy Snow : హిమాచల్‌లో మంచు దుప్పటి కప్పేసింది.. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాదిని మంచు దుప్పటి ఎక్కువైంది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో ఈ సీజన్‌లో మొదటిసారి విపరీతంగా మంచు పడింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, కుఫ్రి, స్పితి, ఖరపత్తర్, మనాలీ తదితర ప్రాంతాల్లో మంచు కురవడంతో ఆ ప్రాంతాలు పూర్తిగా శ్వేత వర్ణంతో దర్శనమిస్తున్నాయి.
bరహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, కొండలపై మంచు కప్పుకున్న దృశ్యాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
మంచు పడటం వల్ల ఉష్ణోగ్రతలు క్షీణించాయి. రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగి, కొన్ని ప్రదేశాలలో మైనస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. టాబో నగరంలో ఉష్ణోగ్రతలు మైనస్ 13 డిగ్రీల సెల్సియస్‌గా పడిపోయాయి.
Details
సిమ్లాలో 2.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
కుకుమ్‌సేరిలో మైనస్ 6.9°C, కల్పలో మైనస్ 3.3°C, రెకాంగ్ పియోలో మైనస్ 1°C, నార్కండలో మైనస్ 0.8°Cగా ఉష్ణోగ్రతలున్నాయి.
ఇక సిమ్లాలో ఉష్ణోగ్రత 2.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇతర ప్రాంతాల్లో గడ్డకట్టే ఉష్ణోగ్రతలు ఉన్నాయి.
సియోబాగ్‌లో 0°C, బజౌరాలో 0.1°C, మనాలిలో 0.2°C, కుఫ్రీలో 0.4°C, సోలన్‌లో 0.5°C, ఉనాలో 1°Cగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారీగా మంచు పడటం వల్ల సాధారణ జీవనశైలికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడాయి.
రహదారులపై మంచు పేరుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో గిరిజన ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మంచు దుప్పట్లో హిమచల్ ప్రదేశ్
#WATCH | Himachal Pradesh: Shimla's Hill Resort area is covered in a blanket of snow. pic.twitter.com/9Hn146IcOn
— ANI (@ANI) December 9, 2024