
Vishakapatnam: ముడసర్లోవ జలాలపై సోలార్ ప్లాంటు ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం నగరంలోని ముడసర్లోవ జలాశయం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈజలాశయం చుట్టూ ప్రకృతి అందాలను చాటే పర్వతాలతో నిండిపొయి,సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈజలాలపై ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంటు ఇప్పుడు ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణగా మారింది. పగటిపూట సూర్యుని కిరణాలు నీటిపై పడుతూ సోలార్ ఫలకాలపై ప్రతిఫలించడంతో ఒక అద్భుతమైన ప్రకాశాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఈదృశ్యం చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది.జలాశయం సమీపంలో ఉన్న పార్కును సందర్శించే వారు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా సోలార్ ప్లాంట్‌ను చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. ఈప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతున్న2మెగావాట్ల విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(APEPDCL)కు విక్రయిస్తున్నారు. ఇలా పర్యాటక ఆకర్షణతోపాటు విద్యుత్ ఉత్పత్తిలోనూ ముడసర్లోవ జలాశయం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.