
Udhampur Encounter: భద్రతా బలగాలు,ఉగ్రవాదులకు మధ్య ఉదమ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్.. సైనికుడి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని ఉదమ్‌పుర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ ఉద్రిక్తతకు దారితీసింది.
ఉగ్రవాదులు దాక్కున్నారని వచ్చిన ఖచ్చితమైన సమాచారం నేపథ్యంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
ఈ ఆపరేషన్‌లో భాగంగా దుడు-బసంత్‌గఢ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ కాల్పుల్లో ఓ సైనికుడు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అతడికి తక్షణమే మెరుగైన వైద్యం అందించినా, ప్రాణాలు కాపాడలేకపోయారని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ వెల్లడించింది.
ఈ సంఘటనలో ఆ సైనికుడు అమరుడయ్యాడు.
వివరాలు
ఉగ్రవాదుల నుంచి ఎదురుదాడి
నిఘా సమాచారం మేరకు బసంత్‌గఢ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉండవచ్చన్న అనుమానంతో భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసుల సహకారంతో సంయుక్త ఆపరేషన్ చేపట్టారు.
ఆపరేషన్ సందర్భంగా ఉగ్రవాదుల నుంచి ఎదురుదాడి జరగగా, భద్రతా దళాలు కూడా తగిన ప్రతిచర్య చేపట్టాయి.
ప్రస్తుతం కూడా ఆ ఎన్‌కౌంటర్ కొనసాగుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.