G20 సమ్మిట్ నేపథ్యంలో..దిల్లీ మెట్రో కీలక ప్రకటన
సెప్టెంబర్ 9 నుండి 10 వరకు న్యూఢిల్లీలో జరగనున్న G20 సమ్మిట్ నేపథ్యంలో,దిల్లీ మెట్రో సోమవారం కీలక ప్రకటన జారీ చేసింది. కొన్ని మెట్రో స్టేషన్ గేట్లను సెప్టెంబర్ 8 నుండి 10 వరకు మూసివేయనున్నట్లు పేర్కొంది. వీవీఐపీల తరలింపు సమయంలో కొన్ని మెట్రో స్టేషన్ గేట్లను సెప్టెంబర్ 8 నుండి 10 వరకు మూసివేయనున్నట్లు పేర్కొంది. వీవీఐపీల తరలింపు సమయంలో నిర్దేశించిన గేట్లు కాకుండా, మిగతా ఢిల్లీ మెట్రో సాధారణంగా పనిచేస్తుందని తెలిపింది. G20 సమ్మిట్ కోసం ప్రయాణీకుల రద్దీని అంచనా వేస్తూ,దిల్లీ మెట్రో సెప్టెంబర్ 4 నుండి13 వరకు 36 స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా 'టూరిస్ట్ స్మార్ట్ కార్డ్‌లను' విక్రయిస్తుందని అధికారులు వార్తా సంస్థ PTI కి తెలిపారు.
సాధారణ రోజులలో కూడా అందుబాటులో టూరిస్ట్ స్మార్ట్ కార్డ్‌లు
ఈ కార్డ్‌లు మెట్రో నెట్‌వర్క్‌లో "అపరిమిత రైడ్‌లను" అందిస్తూ,ఒక రోజు, మూడు-రోజుల చెల్లుబాటులో రెండు క్యాటగిరీలలో అందుబాటులో ఉంటాయి. టూరిస్ట్ స్మార్ట్ కార్డ్‌లు సాధారణ రోజులలో కూడా అందుబాటులో ఉంటాయి, అయితే, G20 సమ్మిట్ దృష్ట్యా, ఈ కార్డులను సోమవారం నుండి 10 రోజుల పాటు విక్రయించడానికి ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేసినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు.రాబోయే G20 సమ్మిట్ కారణంగా ఢిల్లీకి వచ్చినప్పుడు రాజధాని నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను వీక్షంచడానికి ఆసక్తి ఉన్న G20 ప్రతినిధులు,అంతర్జాతీయ సందర్శకులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయని అధికారి తెలిపారు.
స్మార్ట్ కార్డ్‌లో రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్
ఒకరోజు కార్డు రూ.200కు, మూడు రోజుల కార్డు ధర రూ.500 కు అందుబాటు ఉంటాయి. ఈ కార్డులో రూ.50 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఉందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తెలిపింది. ఈ కార్డులను ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించే 36 స్టేషన్లలో కాశ్మీరే గేట్, చాందినీ చౌక్, చావ్రీ బజార్, న్యూఢిల్లీ, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్, లోక్ కళ్యాణ్ మార్గ్, సుప్రీంకోర్టు, ITO, హౌజ్ ఖాస్, నెహ్రూ ప్లేస్, కల్కాజీ మందిర్, అక్షరధామ్, టెర్మినల్ 1 IGI విమానాశ్రయం ఉన్నాయి