ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీఎస్.. బీజేపీతో కుదిరిన ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశంలో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
కర్ణాటకలోని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లో చేరింది.
ఈ మేరకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను శుక్రవారం జేడీఎస్ అధ్యక్షుడు దేవేగౌడ కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి కలిశారు.
ఎన్డీఏ కూటమిలో జేడీఎస్ చేరుతున్నట్లు బీజేపీ అధ్యక్షుడు నడ్డా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఎన్జీఏలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నందుకు సంతోషిస్తున్నట్లు నడ్డా ట్వీట్ ద్వారా తెలియజేశారు.
హెచ్‌డీ దేవెగౌడ, అతని కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి పార్లమెంటు హాల్‌లో అమిత్ షా, జేపీ నడ్డాను గురువారం కలిశారు. ఒకరోజు తర్వాత ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
బీజేపీ
2019లో కాంగ్రెస్‌తో.. ఇప్పుడు బీజేపీతో పొత్తు
2024 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో జేడీ(ఎస్), బీజేపీ పొత్తుపై చర్చించేందుకు పార్లమెంట్ హాల్‌లో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ చర్చ ఇరు పక్షాలు సానుకూలంగా స్పందించడంతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం జేడి(ఎస్)తో తమ పార్టీ ఒక అవగాహనను పరిశీలిస్తోందని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.
అప్పటి నుంచి ఇరు పార్టీల పొత్తుపై ఊహాగానాలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో జేడీ(ఎస్) పొత్తు పెట్టుకుంది.
ఆ తర్వాత ఇరు పార్టీల మధ్య పొత్తు వీగిపోయింది. ఇప్పుడు జేడీఎస్ బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకుంది.
అయితే ఈ పొత్తు బంధం ఎన్నాళ్లు ఉంటుందో వేచి చూడాలి మరి.