తదుపరి వార్తా కథనం
Sonia Gandhi: సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 21, 2025
09:15 am
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు.
పొత్తికడుపు సంబంధిత సమస్యల కారణంగా గురువారం ఉదయం ఆమె ఆసుపత్రిలో చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని సర్ గంగారాం ఆసుపత్రి బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఛైర్మన్ అజయ్ స్వరూప్ తెలిపారు.
గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ సమీరన్ నందీ ఆమె ఆరోగ్యంపై నిశితంగా పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. గతేడాది డిసెంబరులో సోనియా గాంధీ 78వ ఏట అడుగుపెట్టారు.