Sonia Gandhi: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ.. వైద్యులు ఏమన్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
గురువారం ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరగా, వైద్యులు పొత్తికడుపు సమస్య కారణంగా ఆమె చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
సోనియాకు అందించిన చికిత్స విజయవంతమవడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆమెను డిశ్చార్జ్ చేశారు.
Details
నిలకడగా సోనియా గాంధీ ఆరోగ్యం
వైద్యుల ప్రకారం, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.
గతేడాది డిసెంబర్‌లో 78వ ఏట అడుగుపెట్టిన సోనియా గాంధీ, ప్రత్యక్ష రాజకీయాలకు విరామం ప్రకటించి, లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవకుండా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.
ఈ క్రమంలో ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి, వయనాడ్ ఎంపీగా గెలిచారు. కుమారుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.