పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ 9అంశాలపై చర్చించాలి: మోదీకి సోనియా గాంధీ లేఖ
సెప్టెంబర్ 18-22 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక సమావేశాల అంజెడా ఏంటని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. చర్చించాల్సిన 9అంశాలను ఆ లేఖలో సోనియా గాంధీ పొందుపర్చారు. రాబోయే సెషన్‌లో ఈ అంశాలపై చర్చకు కచ్చితంగా సమయం ఇవ్వాలని ప్రధానిని సోనియా కోరారు. ఇతర రాజకీయ పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారనే విషయాన్ని ఈ సందర్భంగా సోనియా గాంధీ ఎత్తిచూపారు. ప్రజా ఆందోళన, ప్రాముఖ్యత గల విషయాలను లేవనెత్తడానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.
సోనియా గాంధీ లేఖలోని 9అంశాలు ఇవే..
1. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, అసమానతలు, ఎంఎస్ఎంఈల సమస్యలు. 2. రైతులు, రైతు సంఘాలకు ఎంఎస్పీతో పాటు ఇతర హామీలపై దృష్టిసారించాలి. 3. అదానీ గ్రూప్ అవకతవకలపై దర్యాప్తు చేయడానికి జేపీసీని ఏర్పాటు 4. మణిపూర్ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో యంత్రాంగం విఫలమైంది. సామాజిక సామరస్యం విచ్ఛిన్నమైంది. 5. హర్యానాలో మతపరమైన ఉద్రిక్తతలు పెరగాయి. 6. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దుల్లో భారత సార్వభౌమాధికారానికి సవాళ్లు ఎదరవుతున్నాయి. 7. దేశంలో కుల గణన తక్షణ అవసరం. 8. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు తిన్నాయి. 9. కొన్ని రాష్ట్రాలు వరదలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలతో అవస్థలు పడుతున్నాయి.