LOADING...
 Sonia Gandhi: సోనియాగాంధీకి ఆస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక 
సోనియాగాంధీకి ఆస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

 Sonia Gandhi: సోనియాగాంధీకి ఆస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2026
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ అనారోగ్యంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం సాయంత్రం ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఛాతీ సంబంధిత నిపుణుని నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆమె అనారోగ్యం నుంచి క్రమంగా కోలుకుంటున్నారని, ప్రస్తుతం సాధారణ స్థితిలోనే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు పిటిఐ వార్తా సంస్థకు తెలిపాయి.

Details

దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం

గత కొంతకాలంగా సోనియా గాంధీ దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఇటీవల వాయు కాలుష్యం తీవ్రంగా పెరగడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ కావడంతో, ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఇది సాధారణ వైద్య పరీక్షల కోసమేనని వారు స్పష్టం చేశారు. గత డిసెంబర్‌లో సోనియా గాంధీ తన 79వ పుట్టినరోజును జరుపుకున్నారు. వయసు రీత్యా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆమె అడపాదడపా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

Advertisement