LOADING...
Special Trains: దసరా,దీపావళి పండుగ వేళ.. ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులకు రైల్వే గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లలో ప్రత్యేక రైళ్లు పొడగింపు!
ఈ రూట్‌లలో ప్రత్యేక రైళ్లు పొడగింపు!

Special Trains: దసరా,దీపావళి పండుగ వేళ.. ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులకు రైల్వే గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లలో ప్రత్యేక రైళ్లు పొడగింపు!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్తను అందించింది. దసరా, దీపావళి పండుగలు దగ్గరపడుతున్న తరుణంలో ప్రయాణికుల రద్దీ అధికం కానుందన్న అంచనాతో, ఇప్పటికే నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల గడువును మరోసారి పొడగించేందుకు నిర్ణయం తీసుకుంది. మొదట ఆగస్టులో ముగియాల్సిన ఈ రైళ్ల ప్రత్యేక సేవలను ఇప్పుడు నవంబర్‌ 24 వరకు కొనసాగిస్తామని రైల్వే శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. దీంతో పండుగ సమయాల్లో సొంత ఊళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారికి ప్రయాణం మరింత సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు.

వివరాలు 

ప్రత్యేక రైళ్ల పొడిగింపు వివరాలు: 

తిరుపతి-సాయినగర్‌ షిర్డీ మధ్య నడుస్తున్న 07637/07638 నెంబర్‌ ప్రత్యేక రైళ్లు నవంబర్‌ 24 వరకు ప్రయాణికుల సేవలో కొనసాగుతాయని రైల్వే వెల్లడించింది. నరసాపురం-తిరువణ్ణామలై మార్గంలో నడిచే 07219/07220 ప్రత్యేక రైళ్లు కూడా అదే తేదీ వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు. అదనంగా, హైదరాబాద్-కన్యాకుమారి మార్గంలో నడిచే 07230/07229 ప్రత్యేక రైలు, కాచిగూడ-మధురై మార్గంలో నడిచే 07191/07192 ప్రత్యేక రైళ్లు కూడా పొడిగింపులో భాగంగా కొనసాగనున్నాయని రైల్వే పేర్కొంది. అలాగే, హైదరాబాద్-కొల్లాం మార్గంలో నడుస్తున్న 07193/07194 ప్రత్యేక రైళ్లు తిరుపతి, రేణిగుంట మీదుగా నవంబర్‌ నెలాఖరు వరకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు.