LOADING...
Special trains: ప్రత్యేక వీక్లీ రైళ్లను అక్టోబరు వరకూ పొడిగించిన దక్షిణ మధ్య .రైల్వే
ప్రత్యేక వీక్లీ రైళ్లను అక్టోబరు వరకూ పొడిగించిన దక్షిణ మధ్య .రైల్వే

Special trains: ప్రత్యేక వీక్లీ రైళ్లను అక్టోబరు వరకూ పొడిగించిన దక్షిణ మధ్య .రైల్వే

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి తమిళనాడు, కేరళకు వెళ్లే పలు ప్రత్యేక వీక్లీ రైళ్ల సేవలను దక్షిణ మధ్య రైల్వే అక్టోబర్‌ వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి: ప్రతి సోమవారం నడిచే కాచిగూడ-మదురై (07191) ప్రత్యేక రైలు సేవలను అక్టోబర్‌ 13 వరకు అందుబాటులో ఉంచనున్నారు. అలాగే, ప్రతి బుధవారం మదురై-కాచిగూడ (07192) రైలు అక్టోబర్‌ 15 వరకు ప్రయాణికులకు లభించనుంది. ప్రతి శనివారం నడిచే హైదరాబాద్‌-కొల్లం (07193) ప్రత్యేక రైలు అక్టోబర్‌ 11 వరకు,ప్రతి సోమవారం కొల్లం-హైదరాబాద్‌ (07194) రైలు అక్టోబర్‌ 13 వరకు అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌-కన్యాకుమారి (07230) ప్రత్యేక రైలు ప్రతి బుధవారం నడుపుతుండగా,దీని సేవలు అక్టోబర్‌ 8 వరకు కొనసాగనున్నాయి.

వివరాలు 

ప్రత్యేక రైళ్లను ఆగస్టు నెలాఖరు వరకు ఐదేసి ట్రిప్పులు చొప్పున నడిపించాలని నిర్ణయం 

ఇక ప్రతి శుక్రవారం కన్యాకుమారి నుంచి బయల్దేరే (07229) రైలు అక్టోబర్‌ 10 వరకు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ శ్రీధర్ బుధవారం తెలియజేశారు. ఇదే సమయంలో ఇతర మార్గాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 38 ప్రత్యేక రైళ్ల ట్రిప్పులు అదనంగా నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, సికింద్రాబాద్‌-తిరుపతి, తిరుపతి-సికింద్రాబాద్‌ (07009, 07010) కాచిగూడ-నాగర్‌సోల్‌, నాగర్‌సోల్‌-కాచిగూడ (07055, 07056) నాందేడ్‌-తిరుపతి, తిరుపతి-నాందేడ్‌ (07015, 07016) నాందేడ్‌-ధర్మవరం, ధర్మవరం-నాందేడ్‌ (07189, 07190) ఈ ప్రత్యేక రైళ్లను ఆగస్టు నెలాఖరు వరకు ఐదేసి ట్రిప్పులు చొప్పున నడిపించాలని నిర్ణయించినట్లు రైల్వే ప్రకటించింది.