LOADING...
Railway Mega Depo: మహబూబాబాద్‌లో రూ.908 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే మెగా డిపో నిర్మాణం
మహబూబాబాద్‌లో రూ.908 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే మెగా డిపో నిర్మాణం

Railway Mega Depo: మహబూబాబాద్‌లో రూ.908 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే మెగా డిపో నిర్మాణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2025
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని తెలుగు రాష్ట్రాల్లో సరుకు రైళ్ల నిర్వహణకు ఉపశమనం కలిగింది. మంగళవారం రూ.1,361 కోట్ల విలువైన పలు పనులను రైల్వేశాఖ ఆమోదించింది. 'అంబ్రెల్లా వర్క్స్‌' ప్రాజెక్ట్‌ కింద ఈ ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో రూ.908.15 కోట్లతో 'మెగా మెయింటెనెన్స్‌ డిపో' నిర్మించనున్నారు. ఈ మెగా డిపో ద్వారా పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్, రెగ్యులర్‌ ఓవర్‌హాలింగ్, సిక్‌లైన్, ట్రైన్‌ ఎగ్జామినేషన్‌ వంటి కీలకమైన నిర్వహణ పనులు జరుగుతాయి. ఈ విధమైన మెగా మెయింటెనెన్స్‌ డిపో ద.మ.రైల్వే జోన్‌లో రాక ఇది మొదటిది కావడం విశేషం. కొత్త సదుపాయాల వల్ల సరుకు రైళ్ల నిర్వహణ మరింత సమర్థవంతంగా, సమయానుకూలంగా నిర్వహించగలుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.