Page Loader
Monsoon: పూర్తైన నైరుతి రుతుపవనాల తిరోగమనం..దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం 
పూర్తైన నైరుతి రుతుపవనాల తిరోగమనం

Monsoon: పూర్తైన నైరుతి రుతుపవనాల తిరోగమనం..దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2024
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

నైరుతి రుతుపవనాల తిరోగమనం పూర్తయింది. ఈ ఏడాది రుతుపవనాలు అంచనా తేదీకి ముందు జూన్‌ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఉత్తర భారతదేశం నుండి తిరోగమనం ప్రారంభించిన నైరుతి మంగళవారం రాష్ట్రం నుంచి పూర్తిగా నిష్క్రమించింది. ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మరోవైపు, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది, ఇది వాయుగుండంగా మారి గురువారం నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపునకు కదిలే అవకాశాలు ఉన్నాయని సూచించింది. ఈ ప్రభావంతో బుధ, గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

వివరాలు 

ధవలాపూర్‌లో 4.5 సెం.మీల వర్షం

మంగళవారం తెలంగాణలో అత్యధికంగా వికారాబాద్‌ జిల్లా యాలాల్‌ మండలం ధవలాపూర్‌లో 4.5 సెం.మీల వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్, మేడ్చల్‌ మల్కాజిగిరి, నారాయణపేట, యాదాద్రి, జనగామ, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్‌ వంటి జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.