Page Loader
TGSRTC: శబరిమల యాత్రికులకు స్పెషల్ ఆఫర్.. బస్సుల్లో ప్రత్యేక రాయితీలు 
శబరిమల యాత్రికులకు స్పెషల్ ఆఫర్.. బస్సుల్లో ప్రత్యేక రాయితీలు

TGSRTC: శబరిమల యాత్రికులకు స్పెషల్ ఆఫర్.. బస్సుల్లో ప్రత్యేక రాయితీలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2024
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

శబరిమల యాత్రకు బయలుదేరే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. శబరిమల వెళ్లేందుకు బస్సు బుక్‌ చేసే భక్తులకు ఒక గురుస్వామి, పదేళ్లలోపు ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంటవాళ్లు, ఒక అటెండెంట్‌కు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది. అలాగే వివాహాలు, శుభకార్యాలు, శబరి యాత్రలు, విహారయాత్రల కోసం బస్సులు అద్దెకు తీసుకునే ప్రయాణికులకు రుసుములో 15 నుంచి 20 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది.

details

టీఎస్‌ఆర్టీసీ రుసుముల్లో 20% తగ్గింపు

సూపర్‌ లగ్జరీ బస్సుల ధర కిలోమీటరుకు రూ.65 నుంచి రూ.59కి, రాజధాని బస్సు ధర రూ.84 నుంచి రూ.77కి తగ్గించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతంలో జనరల్ బస్‌ పాస్‌ ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్ పుష్పక్‌ పాస్‌ కలిగిన ప్రయాణికులు తమ పాస్ చూపించి ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ పొందవచ్చు. ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలని బీహెచ్‌ఈఎల్‌ డిపో మేనేజర్‌ ప్రయాణికులను ఆహ్వానించారు. మరిన్ని వివరాలకు 9652473037, 7382837094, 9959226149 నంబర్లలో సంప్రదించవచ్చు.