Southern Railway: అనకాపల్లి-చర్లపల్లి రూట్‌లో ప్రత్యేక రైళ్లు: 18,19 తేదీల్లో అదనపు సర్వీసులు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ మధ్య రైల్వే (ద.మ. రైల్వే) తాజాగా అనకాపల్లి-చర్లపల్లి మార్గంలో ఈ నెల 18, 19 తేదీల్లో మూడు అదనపు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు వెల్లడించింది. ఈ రైళ్లు నల్గొండ,మిర్యాలగూడ,గుంటూరు,విజయవాడ,రాజమహేంద్రవరం మార్గాల ద్వారా ప్రయాణిస్తాయి. అనకాపల్లి నుంచి చర్లపల్లి కి ప్రత్యేక రైలు ఈ నెల 18న రాత్రి 10.30 గంటలకు బయలుదేరి,మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు తన గమ్యస్థానానికి చేరనుంది. అదే విధంగా,చర్లపల్లి నుంచి అనకాపల్లి రైలు 19న అర్ధరాత్రి 12.40 గంటలకు బయలుదేరి,అదే రోజు రాత్రి 9 గంటలకు గమ్యానికి చేరుతుంది. 19న రాత్రి 10.30గంటలకు అనకాపల్లి నుంచి చర్లపల్లికి మరో ప్రత్యేక రైలు బయలుదేరి,తదుపరి రోజు ఉదయం 11.30గంటలకు గమ్యస్థానానికి చేరతుందని ద.మ.రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
18, 19న ప్రత్యేక రైళ్లు: ద.మ.రైల్వే
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని చర్లపల్లి–అనకాపల్లి మధ్య 3 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికుల సౌకర్యానికి ఈ ప్రత్యేక ఏర్పాట్లు. 🚆🌾
— South Central Railway (@SCRailwayIndia) January 12, 2026
🗞️News Published in Mana Telangana Newspaper #SankrantiSpecialTrains #SCRailway #FestivalRush #SpecialTrains pic.twitter.com/JQ3rOhYlzg