LOADING...
Amaravati: ఓఆర్‌ఆర్‌ భూసేకరణలో వేగం.. అమరావతి ప్రగతి దిశగా కీలక అడుగు
ఓఆర్‌ఆర్‌ భూసేకరణలో వేగం.. అమరావతి ప్రగతి దిశగా కీలక అడుగు

Amaravati: ఓఆర్‌ఆర్‌ భూసేకరణలో వేగం.. అమరావతి ప్రగతి దిశగా కీలక అడుగు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2025
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజధాని అమరావతికి ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టుగా నిలిచే ఓఆర్‌ఆర్‌ (అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్‌) నిర్మాణం పురోగమిస్తోంది. ఈ ప్రాజెక్టు మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేయనుంది. ఈ మేరకు భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఓఆర్‌ఆర్‌ భూసేకరణ అధికారులుగా ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లు నియమితులయ్యారు. ఈ రహదారి కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాల్లో 121 గ్రామాల మీదుగా విస్తరించనుంది. దీని మొత్తం పొడవు 189.9 కి.మీ. కాగా, కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్‌ఆర్‌కు అనుసంధాన రహదారులుగా రెండు రోడ్లను నిర్మించనున్నారు.

Details

తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కి.మీ. మేర ఆరు వరుసల రహదారి

ఈ ప్రాజెక్టులో విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ తేల్చింది. దానికి బదులుగా రెండు అనుసంధాన రహదారులకు అనుమతి ఇచ్చింది. గచ్చిబౌలి నుంచి హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌కు అనుసంధానం ఉన్నట్లే, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజ నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కి.మీ. మేర ఆరు వరుసల రహదారిని నిర్మించనున్నారు. దీనికోసం మూడు ఎలైన్‌మెంట్లను ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. గుంటూరు బైపాస్‌లో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ఓఆర్‌ఆర్‌ వరకు నాలుగు వరుసలుగా రహదారిని విస్తరిస్తారు. దీనికీ మూడు ఎలైన్‌మెంట్లు సిద్ధం చేశారు.

Details

తదుపరి కార్యాచరణ 

ఓఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులతో కూడిన ప్రతిపాదనలు, రెండు అనుసంధాన రహదారుల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. ఆతర్వాత అవి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్)కి పంపుతారు. భూసేకరణ కోసం సర్వే నంబర్ల వారీగా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 21 రోజులు గడువిచ్చి, అభ్యంతరాలు అందిస్తారు. జేసీ సమీక్షలు నిర్వహించి పరిష్కారం చేస్తారు. క్షేత్రస్థాయిలో జాయింట్‌ మెజర్‌మెంట్‌ సర్వే, పెగ్ మార్కింగ్‌ చేస్తారు. అభ్యంతరాల పరిష్కారం అనంతరం 3డి నోటిఫికేషన్ జారీ చేస్తారు. భూములు కేంద్రం అధీనంలోకి వస్తాయి. ఆ తర్వాత 3జి3 నోటిఫికేషన్ ఇస్తారు. భూసేకరణ నిధుల కోసం వివరాలు ఎన్హెచ్ఏఐకి పంపిస్తారు. ఆ నిధులు అందిన తర్వాత భూ యజమానులకు ఆన్‌లైన్‌లో చెల్లింపు చేస్తారు.

Advertisement

Details

ఓఆర్‌ఆర్‌ వెళ్ళే జిల్లాలు, మండలాలు, గ్రామాలు

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల, పెరెకలపాడు, గొట్టుముక్కల, మున్నలూరు, మొగులూరు, కునికినపాడు పొన్నవరం, జగన్నాథపురం, జుజ్జూరు, చెన్నారావుపాలెం, తిమ్మాపురం, గూడెం మాధవరం, అల్లూరు, నరసింహారావుపాలెం జి.కొండూరు, కుంటముక్కల, దుగ్గిరాలపాడు, పెట్రంపాడు, గంగినేనిపాలెం, నందిగామ, కోడూరు - మైలవరం, పొందుగుల, గణపవరం ఏలూరు జిల్లా బొడ్డనపల్లె, గరికపాటివారికండ్రిక, పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లి, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, నరసింగపాలెం, సగ్గూరు, కృష్ణవరం, సురవరం, కల్లటూరు గుంటూరు జిల్లా మంగళగిరి, తాడికొండ, మేడికొండూరు, పెదకాకాని, దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ

Advertisement

Details

కృష్ణా జిల్లా 

బండారుగూడెం, అంపాపురం, సగ్గురు ఆమని, బల్లిపర్రు, బుతుమిల్లిపాడు పెద్దఅవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, తేలప్రోలు, వెలినూతల, వెల్దిపాడు, తరిగొప్పుల, వేంపాడు, బొకినాల, మానికొండ మారేడుమాక, కోలవెన్ను, ప్రొద్దుటూరు, కొణతనపాడు, దావులూరు, చలివేంద్రపాలెం, నెప్పల్లె, కుందేరు - రొయ్యూరు, చినపులిపాక, బొడ్డపాడు, నార్త్‌ వల్లూరు, సౌత్‌ వల్లూరు పల్నాడు జిల్లా అమరావతి, పెదకూరపాడు మండలాల్లోని లింగాపురం, ధరణికోట, దిడుగు, నెమలికల్లు, ముస్సాపురం, పాటిబండ్ల, జలాల్‌పురం, కంభంపాడు, తాళ్లూరు, లింగంగుంట్ల, కాశిపాడు గ్రామాలు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే అమరావతి మెట్రో రీజియన్ అభివృద్ధికి పెనుమార్పులు రాబోతున్నాయి.

Advertisement