Page Loader
Jyoti Malhotra: 'పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులను కలిశాను, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించాను'.. జ్యోతి మల్హోత్రా అంగీకారం..!
పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులను కలిశాను, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించాను'.. జ్యోతి మల్హోత్రా అంగీకారం..!

Jyoti Malhotra: 'పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులను కలిశాను, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించాను'.. జ్యోతి మల్హోత్రా అంగీకారం..!

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్‌ అయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా, తనకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలు ఉన్నాయని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఒక ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది. ఆమె ప్రకారం, పాక్‌ హైకమిషన్‌లో పని చేస్తున్న డానిష్‌ అనే అధికారితో తాను నిత్యం టచ్ లో ఉండేదని తెలిపింది. 2023లో వీసా కోసం పాక్ హైకమిషన్‌ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలోనే ఆమెకు తొలిసారిగా డానిష్‌ పరిచయమయ్యాడని పేర్కొంది.

వివరాలు 

బ్లాకౌట్‌ వివరాలు కూడా పాక్‌కు.. 

జ్యోతి మల్హోత్రా, 'ఆపరేషన్ సిందూర్' సమయంలో కూడా పాకిస్తాన్‌కు కీలక సమాచారాన్ని పంపిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో భారత ప్రభుత్వం, పాక్ సరిహద్దు రాష్ట్రాల్లోని విమానా, క్షిపణి దాడులకు వ్యతిరేకంగా రక్షణ చర్యల భాగంగా బ్లాకౌట్‌లను అమలు చేసింది. అయితే ఈ సమాచారాన్ని కూడా జ్యోతి డానిష్‌కు పంపినట్టు సమాచారం. దర్యాప్తు బృందం ఆమె నివాసంలో సోదాలు నిర్వహించి, మూడు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆమెకు చెందిన రెండు బ్యాంక్‌ ఖాతాలను కూడా అధికారులు గమనిస్తున్నారు. ఇక నేటితో ఆమె పోలీసు కస్టడీ ముగియనున్న నేపథ్యంలో హిస్సార్‌ కోర్టులో హాజరుపర్చనున్నారు.

వివరాలు 

డైరీలో పాక్‌పై ప్రేమ.. 

ఇటీవల జ్యోతి మల్హోత్రా డైరీ,కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో ఆమె పాకిస్తాన్‌పై ఉన్న ఆదరణను స్పష్టంగా వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. అక్కడి ప్రజల నుంచి తాను అపూర్వమైన ప్రేమను అందుకున్నానని, ఆ దేశం చాలా రంగులద్దినట్లుగా, క్రేజీగా ఉందని వ్యాఖ్యానించింది.

వివరాలు 

గూఢచర్యంలోకి దించిన 'హ్యాపీనెస్‌' 

పాక్‌ హైకమిషన్‌ వీసా విభాగంలో పనిచేసే డానిష్‌ అనే అధికారి, పంజాబ్‌ రాష్ట్రం మలేర్‌కోట్లా ప్రాంతానికి చెందిన గజాలా అనే యువతిని కూడా హనీట్రాప్‌లోకి లాగి గూఢచర్యానికి ఉపయోగించినట్లు సమాచారం. ఫిబ్రవరి 2న ఆమె కుటుంబానికి వీసాలు పొందేందుకు పాక్ హైకమిషన్‌ కార్యాలయానికి వెళ్లింది. మరుసటి రోజు వీసాల పురోగతిని తెలుసుకునేందుకు గజాలా ఆంటీ నస్రీన్ బానో అక్కడికి వెళ్లింది. అయితే వీసాలు అందరికీ మంజూరవగా,గజాలాకే రాకపోవడం గమనార్హం. ఫిబ్రవరి 27న డానిష్‌ నుంచి ఆమెకు మెసేజ్‌ రావడంతో పరిచయం మొదలైంది. తరువాత అతను ఆమెను టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా చాటింగ్‌కు ఆహ్వానించాడు. ఏప్రిల్‌లో గజాలా,డానిష్‌ సాయంతో వీసా పొందిన తరువాత అతడికి వివాహితుడని ఆమె గ్రహించింది.

వివరాలు 

వీసా కోసం వచ్చేవారే అతని టార్గెట్ 

అయినప్పటికీ డానిష్‌ ఆమెను క్రమంగా గూఢచర్యంలోకి లాగడం ప్రారంభించాడు. భారత సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని అడగడం మొదలుపెట్టాడు. ఆపై డబ్బుల లావాదేవీలు కూడా జరిపాడు. డానిష్‌ నెంబర్‌ను ఆమె తన ఫోన్‌లో 'హ్యాపీనెస్‌' అనే పేరుతో సేవ్‌ చేసినట్లు గుర్తించారు. పాక్ హైకమిషన్‌కు వీసాల కోసం వచ్చే అనేక మందిని టార్గెట్ చేస్తూ, డానిష్‌ వారిని గూఢచర్యానికి వాడుకునేవాడు. యూట్యూబర్ జ్యోతి కూడా వీసా కోసం వెళ్లినప్పుడు అతని ట్రాప్‌లో పడిపోయింది.