Page Loader
శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్‌ రావు కన్నుమూత.. విజయవాడలో అంత్యక్రియలకు ఏర్పాట్లు
శ్రీచైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్‌ రావు కన్నుమూత

శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్‌ రావు కన్నుమూత.. విజయవాడలో అంత్యక్రియలకు ఏర్పాట్లు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 13, 2023
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

కార్పోరేట్ విద్యారంగంలో డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ బీఎస్‌రావు అంటే తెలియని వారుండరు. శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు (75) గురువారం కన్నుమూశారు. ఉదయం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో కాలు జారిపడ్డారు. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు అంత్యక్రియల కోసం భౌతిక కాయాన్ని ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు బంధువులు పేర్కొన్నారు. బీఎస్ రావు దంపతుల విజయ ప్రస్థానం : బీఎస్ రావు, ఝాన్సీ లక్ష్మీబాయి దంపతులు మూడు దశాబ్దాల క్రితం ఇంగ్లండ్‌, ఇరాన్‌లో వైద్యులుగా సేవలందించారు.

DETAILS

శ్రీ చైతన్య గ్రూపులో సుమారు 8.5 లక్షల మంది  

1986 లో స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం శ్రీ చైతన్య పేరిట ఓ విద్యాసంస్థను ఏర్పాటు చేశారు. తొలుత విజయవాడలో బాలికల జూనియర్‌ కళాశాలకు అంకురార్పణ చేశారు. ఇక అక్కడ్నుంచి వెనుదిరగకుండా విజయవాడ కేంద్రంగానే విద్యాసంస్థలను అంచెలంచెలుగా రాష్ట్ర ఎల్లలు దాటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్‌ ( ఇంజినీరింగ్, మెడికల్) సహా జాతీయ స్థాయి ఎంట్రెన్స్ పరీక్షలకు కేరాఫ్ అడ్రెస్ గా శ్రీ చైతన్యను తీర్చిదిద్ధారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 321 జూనియర్‌ కాలేజీలు, 322 టెక్నో స్కూల్స్‌, 107 సీబీఎస్‌ఈ పాఠశాలలను శ్రీచైతన్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మరోవైపు గ్రూపు విద్యాసంస్థల్లో దాదాపు 8.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారంటే అది బీఎస్ రావు సంకల్ప బలానికి నిదర్శనంగా నిలుస్తోంది.