LOADING...
Puttaparthi: శ్రీ సత్యసాయి శతజయంతి.. ఒకే వేదికపై చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి!
శ్రీ సత్యసాయి శతజయంతి.. ఒకే వేదికపై చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి!

Puttaparthi: శ్రీ సత్యసాయి శతజయంతి.. ఒకే వేదికపై చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2025
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకలు పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ఉపరాష్ట్రపతి జగ్గనాథ్ రాధాకృష్ణన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరై శతజయంతి ఉత్సవాలను మరింత ప్రత్యేకం చేశారు. వారితో కలిసి ఇరు రాష్ట్రాల మంత్రులు కూడా పాల్గొన్నారు. హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంప్రదాయాల రంగురంగుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలను ప్రతిబింబించే కళారూపాలు, డ్యాన్స్ ప్రదర్శనలు, ఆధ్యాత్మిక వైభవాన్ని చూపించే ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులను మైమరిపించాయి. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ప్రతినిధులు తమ ప్రాంతంలోని ప్రసిద్ధ క్షేత్రాల ప్రత్యేకతలను ప్రతిబింబించే ఆకృతులతో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.

Details

ప్రపంచ నలమూలల నుంచి భక్తుల హాజరు

అలాగే ఈ వేడుకలకు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు గవర్నర్లు కూడా విచ్చేసి, కార్యక్రమాలకు మరింత ప్రాముఖ్యతను తీసుకొచ్చారు. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరి అభిమానాన్ని సంపాదించాయి. శతజయంతి వేడుకల భాగంగా, ఇవాళ ప్రశాంతి నిలయంలోని మందిరం నుంచి స్వర్ణరథంపై భగవాన్ సత్యసాయి బాబా విగ్రహాన్ని భక్తుల ఊరేగింపుతో హిల్ వ్యూ స్టేడియం వరకు తీసుకెళ్లనున్నారు. ఈ శతజయంతి ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. సేవా మార్గాన్ని జీవన విధానంగా మార్చి, ఆ బోధనలతో కోట్లాది మందిని ప్రభావితం చేసిన సత్యసాయి బాబా శతజయంతి కావడంతో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు.